తాజా వార్తలు

Thursday, 17 September 2015

తెలుగుదేశం పార్టీ మళ్లీ కాపీ పోకడనే అనుసరిస్తోందా???

వైఎస్ రాజశేఖర రెడ్డికి మొదటగా కాంగ్రెస్ వాళ్లు.. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ వాళ్లు 'రాజన్న' అనే బిరుదును ఇచ్చుకున్నారు. రాజశేఖరరెడ్డిని కులాలకు మతాలకు అతీతంగా.. అందరికీ అన్నగా మార్చి రాజన్న అని పిలుచుకున్నారు. వైఎస్ బతికున్న రోజుల్లోనే రాజన్న అనే పదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు.. ఆయన పోయాకా "యాడికి బోతావు రాజన్నా..'' అంటూ  ఆ ఇమేజ్ ను మరింతగా పెంచారు.
మరి అదేదో బాగుందని అనుకున్నారో ఏమో కానీ.. ఈ సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ పార్టీ అధినేత చంద్రబాబును "చంద్రన్న''గా మార్చారు తెలుగుదేశం వాళ్లు. సంక్రాంతికి రేషన్ కార్డు దారులకు ఇచ్చిన ఉప్పుపప్పులకు "చంద్రన్న సంక్రాంతి కానుక'' అని పేరు పెట్టగా.. ఆ తర్వాత రంజాన్ కు 'చంద్రన్న తోఫా'' ఇచ్చారు. ఇంకా వేరే పథకాలకు కూడా "చంద్రన్న'' ను పెట్టి బాబును చంద్రన్నగా మార్చాలని చూస్తున్నారు.
మరి రాజన్న ఇమేజ్ నే కాదు.. ఇప్పుడు కాటన్ దొర ఇమేజ్ ను కూడా బాబుకు అతికిస్తున్నారు తమ్ముళ్లు. చంద్రబాబును "అభినవ కాటన్ దొర'' అనేశాడు మంత్రి నారాయణ. పట్టిసీమ పథకం ద్వారా బాబు మరో కాటన్ దొర అయ్యాడని ఈయన చెప్పుకొచ్చాడు. మరి పట్టి సీమ ఒట్టిసీమ మాత్రమే అనే విమర్శలు వస్తున్నాయి. జేపీతో సహా అనేక మంది ఈ విషయంలో బాబు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. కేవలం కమిషన్ల కోసమే ఈ ప్రాజెక్టును చేపట్టారు తప్ప మరోదాని కోసం కాదని వారు అంటున్నారు. ఈ ప్రాజెక్టుతో సీమకు నీళ్లు ఇస్తామని గెజిట్ లోనే పేర్కొనలేదు.. పైపై మాటలు చెప్పి బాబు ప్రభుత్వం మోసం చేస్తోందనే విమర్శలూ ఉన్నాయి. మరి ఈ మాత్రం దానికే బాబును అభినవ కాటన్ దొర అనే స్తున్నారు తమ్ముళ్లు.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. "అభినవ కాటన్ దొర'' అనే పదాన్ని కూడా వైఎస్ హయాంలోనే వాడేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై వైఎస్సార్ ప్రభుత్వం దృష్టిపెట్టగానే.. ఆ కార్యక్రమానికి 'జలయజ్ఞం' అని పేరు పెట్టి.. వైఎస్ ను నయా జనరేషన్ కాటన్ అనేశారు కాంగ్రెస్ వాళ్లు. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్లీ కాపీ పోకడనే అనుసరిస్తోంది. వైఎస్ కు కాంగ్రెస్ వాలాలు, వైకాపా వాళ్లు పెట్టుకున్న బిరుదును చంద్రబాబుకు అతికిస్తోంది. మరి ఇదంతా చూస్తుంటే... తెలుగుదేశం పార్టీ కొత్తగా ఆలోచించుకొంటే మంచిదేమో అని చెప్పాల్సి వస్తోంది. అడుగడుగునా కాపీ కొట్టుకుంటూ పోతే ... నవ్వులపాలవుతారు సుమా!

- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/tdp-owns-ys-image-65459.html#sthash.kdQbL0u0.dpuf
« PREV
NEXT »

No comments

Post a Comment