తాజా వార్తలు

Wednesday, 9 September 2015

బీహార్ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

బీహార్ అసెంబ్లీ ఎన్నికల నగారా  మోగింది.  243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఐదు దశల్లో జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీమ్ జైదీ వెల్లడిస్తూ.. నవంబర్ 29న ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ముగియనుంది. ఐదు దశల్లో కొనసాగే పోలింగ్‌లో అక్టోబర్ 12న తొలిదశ ప్రారంభంకానుంది. అక్టోబర్ 16న రెండో దశ, అక్టోబర్ 28న మూడో దశ, నవంబర్ 1న నాలుగో దశ, నవంబర్ 5న ఐదో దశ పోలింగ్ జరగనుంది. నవంబర్ 8న ఫలితాలు వెల్లడి. 6.68 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్‌లో వాడే ఈవీఎంలు పోటీచేసే అభ్యర్థుల ఫోటోలను కలిగి ఉంటాయి. 47 అసెంబ్లీ స్థానాల్లో నక్సల్స్ ప్రభావం ఉంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర పారామిలటరీ బలగాలు భద్రతను పర్యవేక్షిస్తాయి. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల డిమాండ్ మేరకు సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్ బలగాల భద్రతను ఏర్పాటు చేస్తున్నాం. పెయిడ్ న్యూస్, ఓటర్లకు డబ్బు పంచడం, మద్యం సరఫరాపై కఠినంగా వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment