తాజా వార్తలు

Tuesday, 8 September 2015

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వండి- బీజేపీ

 హైదరాబాద్ లోని  ఇందిరాపార్క్ దగ్గర తెలంగాణ బీజేపీ నేతలు రైతు దీక్షలు చేపట్టారు.  తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్న తెలంగాణ సర్కారు పట్టించుకోకపోవడం లేదని నేతలు మండిపడ్డారు. రైతు గోడు పట్టని ప్రభుత్వం..రైతులకు న్యాయం చేస్తామని చెప్పుకొని కాలం గడిపేస్తోందంటూ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు వెంటనే రుణమాఫీ చేసి... కొత్త రుణాలు అందించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. అంతేకాకుండా మృతుల కుటుంబాలకు తక్షణమే ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. దీక్షలో రైతు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు పాల్గొన్నాయి. 
« PREV
NEXT »

No comments

Post a Comment