తాజా వార్తలు

Thursday, 3 September 2015

ప్రజాస్వామ్యం ఎటు పోతోందోనన్న అనుమానం కలుగుతుంది.

అసెంబ్లీలో జరుగుతున్న వాదోపవాదాలు చూస్తుంటే మన ప్రజాస్వామ్యం ఎటు పోతోందోనన్న అనుమానం కలుగుతుంది. ప్రతిపక్షానికి అడిగే  హక్కు ఉంటుంది.  అడిగే విధానంలో కాస్త ఆతి ఉండవచ్చు...,అది వేరే విషయం....., కానీ  ఆధికార పక్షం  అసలు విషయం వదిలేసి..., ప్రతిదానికీ డొంకతిరుగుడు జవాబులివ్వడం....,  అడిగిన వెంటనే   ఒంటికాలిమీద లేచి.....వితండవాదానికి దిగడం  ఆదికార పక్ష  పెద్దతరహాకు తలవంపులు తెచ్చే విధంగా ఉందన్నది   నిజం.

మా  వాళ్లంతా సంయమనం పాటిస్తారంటూ  నీతులు చెప్పే  చంద్రబాబు., అచ్చంనాయుడు చేసే ఆతివాదనలను ఎందుకు కంట్రోల్ చేయడంలేదో  అర్ధంకాదు. ఒక వేళ ప్రతిపక్ష సభ్యులే  కాస్త రెచ్చగొట్టినా.,  దానిని స్పీకర్ కు విన్నవించడం ఆనవాయితీ...గతంలో    సభ్యుడైనా అమర్యాదకరంగా  మాట్లాడినా., అసభ్య పదజాలం వాడినా..., దానిని రికార్డులనుంచి  తొలగించాలని డిమాండ్ చేయడం..., లేదా  అలా మాట్లాడిన సభ్యుడి నుంచి  క్షమాపణ లేదా విచారం  కోరడం జరిగేది.  చర్చ సందర్భంగా  ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు ఇలా  పొరపాటున  నోరు జారడం.,తర్వాత  దానిని సరిచేసుకోవడం మామూలే... అయితే  ప్రస్తుత శాసనసభలో అలా జరగడంలేదు.... ఒకరు దుర్భాషలాడితే  మరొకరు దానికి  కౌంటర్ గా మరో  పరుషపదం  వాడడం..,లేదా... ఎదుటి వారి వంశాన్ని....అదే పనిగా తూర్పార బట్టడం  ఆనవాయితీగా మారింది.  దీనిని   ఆనవాయితీ అనడం కంటే  నోటి దురుసు అంటే బాగుంటుదేమో....

సెప్టంబర్  3   తేదీన   ప్రతిపక్షనేత  మాట్లాడుతూ అదికారపక్షాన్ని... కాస్త పరుష పదజాలంతోనే  తిట్టి ఉండచ్చు....అయితే   వెంటనే   సంస్కారం  కలిగిన  వారు ఎవరైనా సరే...  మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయడం  సహజం...అలాకోరినప్పుడు   స్పీకర్   పదాలు  అప్రజాస్వామికమైతే  ఉపసంహరించుకోవాలని కోరతారు...  విధానం వల్ల  పొరపాటు చేసిన వారికి... విషయం తెలుస్తుంది... వారు విచారం వ్యక్తం చేయడం అనేది....ఎదురు పక్షం సాధించిన విజయం అవుతుంది. మరి  3 తేదీన జరిగిన  చర్చలో  ప్రతిపక్షనేత  కాస్త పరుషంగా మాట్లాడగానే.... తెలుగుదేశం సభ్యుడు లేచి..., ప్రతిపక్షనేత  వంశాన్ని  అంతటినీ తిట్టి పోశాడు.. 
ఇదేనా...  సంయమనం.......
మా వాళ్లు   సహనంతో  ఉంటారు .....అని చెప్పే  అధికార ఫక్ష నేతకు    గురివింద నీతి......సభ్యుల రీతి తెలియదా.....
..వైఎస్సాఅర్  సి.ఎం గా  ఉన్నపుడు    నేతలు పొగడ్తలతో  ముంచెత్తలేదా......
.అయినా....గతించిన ...నేతలను... స్పరించుకుంటాం  గానీ......ఇలా  సభలో వారి గురించి  చెడుగా మాట్లాడడం ఎంతవరకు  సబబో క్రమశిక్షణ గల పార్టీ  అని చెప్పుకునే  టిడిపి ఆలోచించుకోవాలి మరి.


-          -------శంకరం
« PREV
NEXT »

1 comment