తాజా వార్తలు

Tuesday, 15 September 2015

పడిపోయిన బీఎండబ్ల్యూ కొత్త సీఈవో
జర్మనీలో ఖరీదైన కార్లు తయారు చేసే బీఎండబ్ల్యూ కంపెనీ కొత్త సీఈవో హెరాల్డ్ క్రూగెర్ ఓ కారు షోలో కళ్లు తిరిగి కింద పడిపోయారు. బీఎండబ్ల్యూ లేటెస్ట్ మోడల్ గురించి మీడియాకు వివరిస్తుండగా ఈ ఘటన జరిగింది. వెంటనే స్పందించిన సిబ్బంది  ఆయన పైకి లేచేందుకు సహకరించారు. బీఎండబ్ల్యూ కంపెనీ కొత్త సీఈవో హెరాల్డ్ క్రూగెర్ ఉన్నట్టుండి పడిపోవడంతో ఆ మీడియా సమావేశం అర్థాంతరంగా రద్దయ్యింది. దీనిని తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత చెబుతామని కంపెనీ ప్రతినిధి మీడియాకు తెలిపారు.
« PREV
NEXT »

No comments

Post a Comment