తాజా వార్తలు

Tuesday, 8 September 2015

బ్రూస్ లీ చిత్రంలో ముగ్గురు మొనగాళ్ళు కలిసి పని చేస్తున్నారా...!
రామ్ చరణ్ నటిస్తున్న బ్రూస్ లీ  చిత్రంలో  చిరంజీవి ఓ అతిధి పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే చిరంజీవి అతిధి పాత్ర కోసం ఈ చిత్ర నిర్మాతల నుండి 5 కోట్ల రూపాయలు  తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి నటించడానికి ఎటువంటి రెమ్యునరేషన్ డిమాండ్ చేయలేదని, ఇదంతా తన కొడుకు కోసం ఫ్రీగా చేస్తున్నాడని అంత అనుకున్నారు. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలె గాని చిరంజీవి కూడా బిజినెస్ మైండేడే కదా! . సెప్టెంబర్ 12 నుండి చిరంజీవి ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొననున్నాడు.ఈ చిత్రంలో రామ్ చరణ్ స్టంట్ మ్యాన్ గా కనిపించనున్నాడు.

ఈ చిత్రం లో ఒక కీలకమైన పాత్రలో పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాలో భాగం కానున్నడని విశ్వసనీయ సమాచారం. పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడని తెలుస్తోంది.  ఈ సినిమా కోసం రామ్ చరణ్ ,చిరంజీవి , పవన్ కళ్యాణ్ లు కలిసి పని చేయడం నిజంగా మెగా అభిమానులకు ఇది మంచి శుభ వార్త. గోవా బ్యుటి ఇలియానా ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయనుంది. అలాగే ఈ సినిమాలో చిరు, రామ్ చరణ్ ల మద్య స్టంట్ సీక్వెన్స్ లను ప్లాన్ చేసాడు శ్రీను వైట్ల. సెప్టెంబర్ 12 నుండి చిరంజీవి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు.రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.  
« PREV
NEXT »

No comments

Post a Comment