తాజా వార్తలు

Wednesday, 30 September 2015

ఆ హీరోయిన్ కు కారును గిఫ్ట్ గా ఇచ్చాడంటా....!
టాలీవుడ్ లో కార్లు గిఫ్ట్ ఇవ్వడం పెరిగింది. అయితే ఇదేం కొత్త విషయం కాదు. టాలీవుడ్ లో బిగ్ ప్రొడ్యూసర్ ఒకాయిన తరచు ఇలా చెప్పేవాడు..నా దగ్గర కారు గిఫ్ట్ గా తీసుకోని హీరోయిన్ లేదు అని. సరే ఆ సంగతి అలా వుంచితే,ఆ మధ్య ఓ హీరోయిన్ ఖరీదైన కారు కొన్నది. హీరోయిన్..బోలెడు రెమ్యూనిరేషన్..కారు కొనుక్కోవడం ఏమన్నా వింతా..గొప్పా..అంటే రెండూ కాదు.
కానీ టాలీవుడ్ గుసగుస ఏమిటంటే, ఆ హీరోయిన్ అంటే అమితంగా అభిమానించే ఓ దర్శకుడు ఆ కారును గిఫ్ట్ గా ఇచ్చాడన్నదే. గతంలో ఆ దర్శకుడు ఇలాగే ఓ హీరోయిన్ ను అమితంగా అభిమానించి, మూడు కోట్ల వరకు మునిగాడని టాలీవుడ్ లో ఇప్పటికీ గుసగుస వుంది. ఇప్పుడు ఈ హీరోయిన్ అంటే అమితాభిమాని, అందుకే ఈ బహుమతి అని టాక్. ఏమైనా హీరోయిన్లు కొందరు భలే తెలివైన వాళ్లు..పర్సులో డబ్బులు తీయకుండా పనులు చేయించుకోగలరు..కావాల్సినవి సమకూర్చుకోగలరు. 
అయితే టాలీవుడ్ మరో టాక్ ఏమిటంటే, గత తరం దర్శకులు కొందరు కూడా హీరోయిన్లంటే మహా మోజుగా వుండేవారని, కానీ వారు ఇలా డబ్బులు తగలేసుకునేవారు కాదని, ఈ తరం దర్శకులు మాత్రం అనవసరంగా డబ్బులు పాడు చేసుకుంటున్నారని. టైమ్ మారింది. కొందరు హీరోయిన్లు తెలివి మీరారు..తప్పదు మరి.

Film Desk
« PREV
NEXT »

No comments

Post a Comment