తాజా వార్తలు

Thursday, 17 September 2015

ఆ రాత్రి ఏం జరిగింది-చీకటి రాజ్యం

కమల్ హాసన్  ‘చీకటి రాజ్యం’. ట్రైలర్ విడుదలైంది. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై రాజేష్ ఎం.సెల్వని దర్శకత్వంలో ఎన్.చంద్రహాసన్ నిర్మిస్తున్నారు. ఒకే ఒక్క రాత్రి జరిగే వినూత్నమైన కథతో రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్ ను వినాయక చవితి సంధర్భంగా విడుదల చేసారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇందులో కమల్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. కమల్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. నటి మధుశాలిని ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment