తాజా వార్తలు

Monday, 28 September 2015

త్రీ డేస్‌ కాల్‌షీట్స్‌ ఇచ్చారు మెగాస్టార్‌ ....!దాదాపు ఆరేళ్ల తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి మళ్లీ ముఖానికి రంగేసుకున్నారు. తన తనయుడు రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న బ్రూస్‌లీ చిత్రంలో చిరంజీవి స్పెషల్‌ ఎపియరన్స్‌ ఇస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవిపై రామ్‌ లక్ష్మణ్‌ నేతృత్వంలో కొన్ని యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరించారు. ఈ చిత్రానికి మూడు రోజుల కాల్‌షీట్స్‌ ఇచ్చారు. మెగాస్టార్‌ తనయుడు రామ్‌ చరణ్‌ హీరోగా పరిచయమై నేటితో సరిగ్గా ఎమిదేళ్లు అయింది. 2007లో సెప్టెంబర్‌ 28న రామ్‌ చరణ్‌ తొలి చిత్రం చిరుత విడుదలైంది.

తనయుడు హీరోగా ప్రజలముందు నిలిచి 8 ఏళ్లు అయిన సందర్భంగా చిరంజీవి సెప్టెంబర్‌ 28నే బ్రూస్‌లీ షూటంగ్‌లో పాల్గొనడం విశేషం. పైగా సెప్టెంబర్‌ నెల చిరంజీవికి బాగి కలిసొచ్చిన నెల. ఎందుకంటే ఆయన తొలిచిత్రం ‘ప్రాణం ఖరీదు’ విడుదలయింది సెప్టెంబర్‌ నెలలో కావడం విశేషం. మరి చిరంజీవి ఆరేళ్ల తర్వాత కెమెరా ముందుకు వచ్చారు. ఈసారి బ్రూస్‌లీలో మెగాస్టార్‌ ఎలా అరరిస్తారో వేచి చూడాలి...బ్రూస్‌లీ అడియో అక్టోబర్‌ 2న విడుదల కానుంది. అలాగే ఈ చిత్రం అక్టోబర్‌ 16న రిలీజ్‌ అవుతుంది. 

Film Desk
« PREV
NEXT »

No comments

Post a Comment