తాజా వార్తలు

Wednesday, 9 September 2015

రామ్‌ చరణ్‌ కంటే నేనే బెస్ట్‌ డ్యాన్సర్‌ అంటున్న మెగాస్టార్మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లలో ఎవరు బెస్ట్ డ్యాన్సర్.. ఇది టఫ్ క్వశ్చన్ లా అనిపిస్తుంది. అప్పటి తరానికి చిరు, ఇప్పటి ట్రెండ్ కి చెర్రీ అని.. సమాధానం చెప్తారు ఎవరైనా. కానీ ఇదే క్వశ్చన్ ని రామ్ చరణ్ ని అడిగితే... తప్పనిసరిగా చిరంజీవి పేరే చెబ్తాడని తెలుసు. మరి మెగాస్టార్ ని అడిగితే.. ఏం సమాధానం వస్తుందో ఊహించగలరా? నేనే బెస్ట్ డ్యాన్సర్ అంటున్నారు చిరంజీవి. తెలుగు తెరకు అనేక రకాల డ్యాన్సులను తీసుకొచ్చిన చిరుకు... ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండడం కరెక్టే. కాదనే ధైర్యం కూడా ఎవరికి లేదు. మరి ఈ విషయం కరెక్టే అని ప్రూవ్ అయ్యేదెలాబ్బా అనుకునే వాళ్లకి... బ్రూస్ లీ సమాధానం ఇచ్చేస్తాడు లెండి. అక్టోబర్ 16న రిలీజ్ కానున్న ఈ చిత్రంలో చిరంజీవి కథకు కీలకమైన రోల్ చేయబోతున్నారు. ఓ పాట, ఫైట్ కూడా ఉంటాయి మెగాస్టార్ కి. పనిలో పనిగా ఇద్దరినీ పక్కపక్కన పెట్టేసి డ్యాన్స్ చేయిస్తే సరి.. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ దొరుకుతుంది. ఫ్యాన్స్ కి పండగలాగానూ ఉంటుంది.
« PREV
NEXT »

No comments

Post a Comment