తాజా వార్తలు

Wednesday, 2 September 2015

సినిమా చూపిస్తా మావా రివ్యూ

ఉయ్యాల జంపాల ఫేమ్  రాజ్ తరుణ్  మళ్లీ వెండితెరపై మెరిశాడు. సినిమా చూపిస్తా మావా అంటూ మురిపించాడు.  గోదావరి యాసలో, తనదైన ప్రాసతో ఆశ్చర్యపరిచే రీతిలో పెర్ఫార్మెన్స్ ఇచ్చి మరోసారి టాలెంట్ వుంటే చాలన్న మాటను నిజం చేశాడు. ప్రసన్న కుమార్   మాటలకు తగ్గ సన్నివేశాలు రాస్తున్న ఈరోజుల్లో సన్నివేశాలకు సరిపోయే మాటలు రాసి అందరినీ మెప్పించాడు. 'దేవుడికి కోపం తెప్పిస్తే డాక్టర్ దగ్గరకు పంపుతాడు. డాక్టర్ కి కోపం తెప్పిస్తే దేవుడి దగ్గరకు పంపుతాడు'.. వంటి వెరైటీ సంబాషణలు ఎన్నో వున్నాయి. రాసుకున్న రెండు మూడు సెంటిమెంట్ సీన్లలో సైతం తన 'పెన్ను'తనాన్ని బాగానే చూపించాడు.   హర్రర్, థ్రిల్లర్, లవ్ స్టోరీ ఇలా జోనర్ కి సంబంధం లేకుండా చిన్న సినిమాలకు పెద్ద దిక్కుగా సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మారిపోయాడు. ఈ సినిమాలో పాటలు దాదాపుగా బాగున్నాయి. నేపధ్య సంగీతం కాస్త లౌడ్ గా వున్నా మాస్ కి కిక్కిస్తుంది.
  

« PREV
NEXT »

No comments

Post a Comment