తాజా వార్తలు

Tuesday, 1 September 2015

దసరాకానుకగా డబుల్ బెడ్ రూం ఇండ్లు?

తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం త్వరలోనే ప్రారంభం కానున్నది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం దసరా  కానుకగా డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రజలకు అందించేందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది. సుమారు 50వేల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో 850కోట్లను కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఒక్కో ఇంటికి సుమారు 5లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 6లక్షలు వ్యయం కానుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం అవాస్ యోజన పథకంలో భాగంగా తెలంగాణలో 34 పట్టణాలను ఎంపిక చేసింది. పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కో ఇంటికి 2లక్షల 30వేల రూపాయల ఆర్థికసాయం అందించేందుకు కేంద్రం ముందుకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త భారం తగ్గింది. కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందనుడటంతో వచ్చే నాలుగేళ్లలో 50వేల మందికి ఇళ్లు కట్టించే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం కదులుతోంది.  
« PREV
NEXT »

No comments

Post a Comment