తాజా వార్తలు

Friday, 18 September 2015

ఢిల్లీలో రికార్డు స్థాయిలో డెంగ్యూ కేసులు

దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఢిల్లీలో సుమారు 1800 డెంగ్యూ కేసులు నమోదు కాగా, ఐదుగురు చనిపోయారిని వైద్యాధికారులు తెలిపారు. వాతావరణంలోని తేమ కారణంగానే పెద్ద మొత్తంలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయని ఢిల్లీ మున్సిపల్‌ కార్పోరేషన్‌ డైరెక్టర్‌ వైకే మాన్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ప్రభుత్వాసుపత్రుల్లో వెయ్యి పడకలు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఢిల్లీ గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటోందనీ, ఒక్కో బెడ్‌పై ఇద్దరు డెంగ్యూ రోగులకు చికిత్స చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితి దాపురించకుండా ఉండేందుకు మరిన్ని బెడ్‌లను ఏర్పాటు చేస్తామని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ తెలిపారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment