తాజా వార్తలు

Saturday, 19 September 2015

పొగరాయుళ్లు తస్మాత్ జాగ్రత్త…

పొగతాగితే వచ్చే ఆరోగ్య సమస్యల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నరు. ఊపిరితిత్తులు దెబ్బతింటాయని, గుండె జబ్బులు పెరుగుతాయని మాత్రమే విన్నాం. కానీ ఇంకిన్నో జబ్బులు క్యూలో ఉంటాయట. ఎంత ఎక్కువ పొగ తాగితే అంత ఎక్కువగా శరీరంలోకి దూరిపోతాయట. ఎముకలు కూడా దెబ్బతింటాయి. ఎముకలకే అత్యధిక నష్టం కలుగుతుందట. పొగ మూలంగా ఎముక సాంద్రత తగ్గుతుంది. దీంతో ఇతరత్రా ఎముకలతో పాటు శరీరాన్ని నిటారుగా నిలిపే వెన్నెముక సైతం బలహీనమవుతుంది. ఇది అంతటితోనే ఆగిపోదు. వెన్ను ఇన్‌ఫెక్షన్‌ వంటి రకరకాల సమస్యలనూ తెచ్చిపెడుతుంది.  సిగరెట్‌ పొగాకులో 4వేల రకాల రసాయనాలు ఉంటాయి. వీటిల్లో కొన్ని రసాయనాలు కాల్చిన తర్వాతే హానికరంగా పరిణమిస్తాయి. నిజానికి వెన్నుపూసల మధ్య ఉండే డిస్కులకు రక్త సరఫరా తక్కువగా జరుగుతుంది. సిగరెట్లు, బీడీల వంటివి తాగితే ఇది మరింత పడిపోతుంది. దీంతో డిస్క్‌ల ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడే పోషకాలు అందకుండా పోతాయి. ఇక పొగాకులోని నికొటిన్‌.. మృదు కణజాలం ఏర్పడటానికి దోహదం చేసే కొలాజెన్‌ స్థాయులను తగ్గిస్తుంది. ఫలితంగా మృదులాస్థిలో సాగే గుణం క్షీణించి, బిగువుగా తయారవుతుంది. మృదులాస్థి, వెన్నుపూసలు, డిస్కులు బలహీనమైతే డిస్కు ముందుకు పొడుచుకొచ్చే ముప్పూ పెరుగుతుంది. ఇది వెన్నుపాములోని నాడులు నొక్కుకుపోయేలా చేస్తుంది.  
« PREV
NEXT »

No comments

Post a Comment