తాజా వార్తలు

Wednesday, 16 September 2015

వరంగల్ లో ఎన్ కౌంటర్, ఇద్దరు మావోయిస్టులు మృతి

వరంగల్ జిల్లా గోవిందరావుపేట మండలం రంగాపురం శివారు మొద్దుగుట్ల అడవుల్లో ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో ఒక మహిళ కూడా ఉంది.
మృతులను ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాలకు చెందిన మణికంఠి విద్యాసాగర్‌రెడ్డి అలియాస్ దయా అలియాస్ సాగర్, వడ్డెపల్లికి చెందిన తంగళ్లపెల్లి శృతి  అలియాస్ మహితగా గుర్తించారు. సంఘటనా స్థలం నుంచి ఒక 303, ఒక కార్బైన్, ఐదు కిట్‌బ్యాగులు, నాలుగు ల్యాండ్‌మైన్లు, పది డిటొనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.    హన్మకొండ వడ్డెపల్లికి చెందిన తంగళ్లపెల్లి శృతి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ఉద్యమ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన శృతి తొమ్మిది నెలల క్రితం మావోయిస్టు పార్టీలో చేరారు. వీరిద్దరు కేకేడబ్ల్యూ (కరీంనగర్-ఖమ్మం-వరంగల్) డివిజన్ కమిటీలో సభ్యులుగా కొనసాగుతున్నారు.మూడు నెలల క్రితం మావోయిస్టు పార్టీలో చేరారు.
« PREV
NEXT »

No comments

Post a Comment