తాజా వార్తలు

Saturday, 5 September 2015

రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే-ఎర్రబెల్లి

తెలంగాణ సర్కార్ పై టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి మరోసారి ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో తెలంగాణలో జరిగే ఆత్మహత్యలపై మీడియాతో ఎర్రబెల్లి  మాట్లాడారు. రైతుల ఆత్మహత్యలు, ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలతోనే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని విమర్శించారు. ఆత్మహత్యలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. ఆత్మహత్యలపై ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని సూచించారు. రుణమాఫీపై తూతూమంత్రంగా ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తుందోని విమర్శించారు. రుణమాఫీలో రూ.1000 కోట్ల దుర్వినియోగం అయ్యాయని మంత్రి ఈటెల రాజేందరే ఒప్పుకున్నారని చెప్పారు. తెలంగాణలో అన్ని మండలాల్లో కరవు ఉందన్న ఎర్రబెల్లి, అన్ని మండలాల్లోనూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.  ప్రభుత్వం ఇకనైనా రైతుల పట్ల నిర్లక్ష్యం మాని వారిని ఆదుకుని ఆత్మహత్యలు జరగకుండా చూడాలని ఆయన హితవు పలికారు..
« PREV
NEXT »

No comments

Post a Comment