తాజా వార్తలు

Tuesday, 15 September 2015

వలసదారులపై కఠినంగా వ్యవహరించాలని ఐరోపాదేశాల తీర్మానం
శరణార్థులకు, వలసదారులకు మధ్య తేడా ఏంటో కొన్ని ఐరోపా దేశాలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఈ క్రమంలోనే వలసదారులపట్ల కఠినంగా వ్యవహారించాలని కొన్ని ఐరోపాదేశాలు తీర్మానించుకున్నాయి. అనేక దేశాలు తమ సరిహద్దుల్లో ఆంక్షలు విధిస్తున్నాయి. అక్రమ వలసదారులను అరెస్ట్ చేసేందుకు హంగేరి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే అక్రమ వలసలను అడ్డుకునేందుకు తమ దేశ చట్టాలను కఠినతరం చేసింది. సిర్బియా సరిహద్దుల్లో నిర్మించిన కంచెను దాటుకుని అక్రమ వలసదారులు తమ దేశంలోకి రాకుండా చూసేందుకు భద్రతను మరింత పటిష్టం చేసింది. అక్రమంగా వలస వచ్చిన వారిని జైల్లో పెట్టడం లేదా స్వదేశాలకు పంపే చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. అంతేకాకుండా రైళ్లలో ప్రయాణాలపైనా పరిమితులు విధించింది. సరిహద్దుల వెంబడి సిపాయిలను పెట్టి వలసదారులు రాకుండా అడ్డుకుంటోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment