తాజా వార్తలు

Friday, 11 September 2015

ఫేస్ బుక్ తో అమ్మాయిలను వేధిస్తున్న ఛీటర్ అరెస్ట్

ఫేస్ బుక్ ద్వారా అమ్మాయిలను వేధిస్తున్న అబ్దుల్ మజీద్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయి పేరుతో ఏడాదిన్నర కిందట మజీద్ ఆరు ఫేస్ బుక్ ఎకౌంట్లు ఓపెన్ చేశాడు. ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చదువుతున్న అమ్మాయిలను టార్గెట్ చేశాడు. దాదాపు 200 మంది అమ్మాయిలతో ఫ్రెండ్ షిప్ ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్లంతా తన ట్రాప్ లోకి వచ్చారని నిర్ధారించుకున్న తర్వాత గత ఆరు నెలలుగా వేధించడం మొదలుపెట్టాడు. నగ్నంగా దిగిన ఫోటోలు పంపాలని చెప్పేవాడు. లేకుంటే వాళ్లు షేర్ చేసిన ఫోటోలను పోర్న్ సైట్స్ లో పోస్ట్ చేస్తానని బెదిరించేవాడు. చివరికి అతను ఏం చెబితే అదే చేసే స్థితికి వారిని తీసుకొచ్చాడు. దాదాపు 80 మంది అమ్మాయిలను మోసం చేశాడు. ఓ అమ్మాయి నుంచి భారీగా డబ్బులు కూడా వసూలు చేసినట్టు సైబరాబాద్ సీపీ సీవీ   ఆనంద్ తెలిపారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ లో విద్యార్థులకు ట్యాబ్ లు ఇస్తుండటంతో వారు తెలిసీ తెలియక సామాజిక మాధ్యమాల్లో ఫ్రెండ్ షిప్ పేరుతో మోసపోతున్నారని ఆనంద్ వివరించారు. సైబర్ సెక్యూరిటీపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. మజీద్ బ్లాక్ మెయిల్ బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదని సీపీ ఆనంద్ చెప్పారు. ఒకమ్మాయి ధైర్యం చేసి తల్లికి చెప్పడంతో.. ఈ వ్యవహారం బయటపడింది.  
« PREV
NEXT »

No comments

Post a Comment