తాజా వార్తలు

Saturday, 19 September 2015

జగన్‌పై అలిగిన గాలి ముద్దుకృష్ణమనాయుడు.....!
జగన్‌పై విరుచుకుపడటంలో ఆయనది అందె వేసిన చేయి.. ఒక విధంగా కాదు.. జగన్‌ను విమర్శించడం అనే కాన్సెప్టు మీద పది పీహెచ్‌డీలు చేసినంత సత్తా ఉంది ఆయనకు. అయితే ఈ మధ్య మాత్రం ఆయన తన ప్రావీణ్యతను అంతగా చూపడం లేదు. గత ఐదారేళ్లలో జగన్‌పై ప్రతిఅంశం మీదా... ఏ అంశం లేకపోతే తనే ఒక అంశాన్ని సృష్టించి జగన్‌పై విరుచుకుపడుతూ వచ్చిన గాలి ముద్దుకృష్ణమనాయుడు ఈమధ్య సైలెంట్‌గా ఉన్నాడు.  ఎన్టీఆర్ భవన్‌లో కూర్చొని ఏదోఒక టాపిక్‌ను టేకప్ చేసి వైకాపా అధ్యక్షుడిపై విరుచుకుపడాల్సిన ఈయన ఆపని చేయడం లేదు. అదేమని ఆరాతీస్తే..గాలి ముద్దుకృష్ణమనాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబుపై అలిగాడనే విషయం తెలుస్తోంది. అలగడం కాదు.. బాబుపై పీకల్లోతు కోపంతో ఉన్నాడట ముద్దుకృష్ణమ.  ఎందుకలా.. అంటే చిత్తూరు జిల్లాలో తనకు పరపతి లేకుండా చేశాడని బాబుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారట గాలి. గత ఎన్నికల్లో రోజా చేతిలో ఓటమిపాలైన గాలికి ప్రస్తుతానికి అయితే ఎమ్మెల్సీ పదవి దక్కింది. అయితే ఈ మాత్రంతో ఈయన సంతృప్తి పడటం లేదు! వెనకటికి కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. తను ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరాను.. అలాంటి నన్ను ఎంత బాగా చూసుకోవాలి? అనేది గాలి ప్రశ్న! అసలు జిల్లా టీడీపీని మొత్తం తనకు అప్పగించాలి... అన్నిచోట్లా తను చెప్పిన వాళ్లనే ఇన్ చార్జీలుగా నియమించి.. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి కూడా చిత్తూరు జిల్లా లెవల్లో కూడా తనేక అధికారాలు కావాలనేది గాలి ముద్దుకృష్ణమ ఆకాంక్ష.  అయితే.. అధినేత దీనికి అంత ప్రాధాన్యతను ఇవ్వడం లేదు. ఎమ్మెల్యేగా గెలవలేకపోయిన గాలికి అంత ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం లేదనేది బాబుగారి లాజిక్ కాబోలు. అయితే... గాలి మాత్రం ఇప్పుడు అలిగారు. తనకు ప్రాధాన్యత దక్కి.. తను కోరుకున్న వాటిని తనకు అప్పగించే వరకూ తను జగన్‌పై విరుచుకుపడేది లేదన్నట్టుగా కూడా వ్యవహరిస్తున్నాడాయన. మరి  ఆయనను బాబు ఎలా డీల్ చేస్తాడో... గాలి మళ్లీ ఎప్పుడు తన రొటీన్ డ్యూటీ ఎక్కుతాడో చూడాలి! 
« PREV
NEXT »

No comments

Post a Comment