తాజా వార్తలు

Wednesday, 23 September 2015

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

విజయవాడలోని మేరీస్‌స్టెల్లా కళాశాలలో ఇంటర్‌విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని దొమ్మేటి భానుప్రీతి కళాశాల హాస్టల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప.గోదావరి జిల్లాజంగారెడ్డిగూడెంకు చెందిన భానుప్రీతి ఫస్టియర్‌ చేరింది.అక్కడే హాస్టల్‌లో ఉంటోంది. ఇదిలా ఉండగా, ఆరోగ్యం బాగోలేదని 20రోజుల క్రితం ఇంటికి వెళ్లిన ఆమెఆదివారం రాత్రి హాస్టల్‌కు వచ్చింది. సోమవారం యూనిట్‌ టెస్ట్‌ ఉన్నా వెళ్లకుండా గదిలోనే ఉండిపోయింది. మద్యాహ్నం తోటి స్నేహితులతో బోజనం చేశాకా వాళ్లందరూ పరీక్షకు వెళ్లారు. సాయంత్రం గదికి తిరిగొచ్చిన విద్యార్థులు ఎంతకీ తలుపు తీయకపోవటంతో పగులగొట్టి చూడగా లోపల ఫ్యాన్‌కు ఉరేసుకుని భానుప్రీతి మృతిచెంది కన్పించింది. మృతురాలి తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరకుని భోరుమని విలపించారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment