తాజా వార్తలు

Saturday, 19 September 2015

గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో పాములు, ఎలుకలు

గుంటూరు జీజీహెచ్‌లో ఎలుకల దాడి ఘటన మరువక ముందే.. పాము కలకలం సృష్టించింది. ఎలుకల కోసం ఏర్పాటు చేసిన బోనులో తెల్లవారుజామున పాము పడింది. ఉదయం పనులు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు.. పామును చూసి కంగారుపడ్డారు. వెంటనే వైద్య అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న అధికారులు.. పామును తొలగించారు. ఇప్పటి వరకు ఆస్పత్రిలో ఎలుకల సంచారంతో కంగారుపడుతున్న రోగులు.. ఇప్పుడు పాములు కూడా తిరుగుతున్నాయని తెలుసుకుని బెదిరిపోతున్నారు. వైద్యం కోసం వస్తే ప్రాణాలే పోయాలా ఉన్నాయని వాపోతున్నారు. మరోసారి ఎలుకల కలకలం సృష్టించాయి. ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ విభాగంలో ఓ మహిళ చేయిని ఏలుకలు కొరికాయి. దీంతో ఆస్పత్రి సిబ్బంది వెంటనే ఆ మహిళకు వైద్యం అందించారు. అయితే, ఎలుకల కలకలం విషయం బయటకు రాకుండా సిబ్బంది జాగ్రత్తపడుతున్నారు. మరోసారి ఎలుకల కలకలం సృష్టించాయి. ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ విభాగంలో ఓ మహిళ చేయిని ఏలుకలు కొరికాయి. దీంతో ఆస్పత్రి సిబ్బంది వెంటనే ఆ మహిళకు వైద్యం అందించారు. అయితే, ఎలుకల కలకలం విషయం బయటకు రాకుండా సిబ్బంది జాగ్రత్తపడుతున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment