తాజా వార్తలు

Saturday, 12 September 2015

ప్లాస్టిక్ డబ్బాల్లో లంచ్ చేస్తే హెయిర్ లాస్

ప్లాస్టిక్ డబ్బాల్లో లంచ్ చేస్తే హెయిర్ లాస్ తప్పదంటున్నారు.. బెంగళూరు పరిశోధకులు. మధ్యాహ్న భోజనం ప్లాస్టిక్ లంచ్ బాక్సుల ద్వారా తీసుకునే వారిలో జుట్టు రాలిపోవడం ఖాయమని, ప్లాస్టిక్ బాక్సుల్లో భోజనాలు చేస్తున్న వారికి మిగిలిన వారితో పోల్చితే జుట్టు వేగంగా ఊడిపోతుందని బెంగళూరుకు చెందిన హెయిర్ లైన్ ఇంటర్నేషనల్ అనే రీసెర్చ్ సెంటర్ తేల్చింది. ప్లాస్టిక్ పాత్రలు, ఆహారపు అలవాట్లు రక్తంలో బీపీఏ పెరిగేందుకు కారణమవుతున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నారుల టిఫిన్ బాక్సులు, వాటర్ బాటిళ్లు ప్లాస్టిక్‌తో తయారు చేసినవి కావడం వారిలో సమస్యలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఇక.. దాదాపు ఏడాది పాటు 430 మంది యువతులు, 570 మంది పురుషులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. హెయిర్ లాస్ సమస్యతో చికిత్సలకు వస్తున్న వారిలో 92 శాతం మంది రక్తం, మూత్రం శాంపిళ్లలో ప్లాస్టిక్ (బీపీఏ-బిస్పెనాల్ ఏ) అధికంగా ఉన్నట్టు ఈ రీసెర్చ్‌లో వెల్లడైంది. బీపీఏను కొన్ని రకాల ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీలో వాడతారు.

« PREV
NEXT »

No comments

Post a Comment