తాజా వార్తలు

Sunday, 20 September 2015

హార్థిక్ ఎఫెక్ట్, గుజరాత్ లో ఇంటర్ నెట్ కట్

హార్ధిక్ పటేల్ ఎఫెక్ట్‌తో గుజరాత్   ప్రభుత్వం ఏకంగా మొబైల్ ఫోన్లు, మొబైల్ ఇంటర్‌నెట్‌పై నిషేధం విధించింది.  గుజరాత్‌ లో పటేళ్లకు రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తున్న హార్ధిక్ పటేల్‌ ను గుజరాత్‌ ప్రభుత్వం ముందస్తుగా అరెస్ట్ చేసింది. ఆయన అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రంలో పటేళ్లు ఆందోళనకు దిగే ప్రమాదం ఉందని అనుమానించింది. మొబైల్ ఫోన్లు, మొబైల్ ఇంటర్‌ నెట్ ద్వారా ఆందోళన ఉధృతం అయ్యే అవకాశం ఉందని భావించింది. ఈ నేపథ్యంలోనే ఇంటర్‌ నెట్‌, ఫోన్‌ సర్వీసుల పై నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ పీసీ ఠాకూర్ ప్రకటించారు. ఈ నిర్ణయంపై నిరసన వ్యక్తమవుతోంది. ఆందోళనను నివారించేందుకు సోషల్‌ నెట్‌వర్క్ పై బ్యాన్ విధించటమేమిటని నిరసనలు మొదలయ్యాయి. ఐనా, ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు. అటు హార్ధిక్ పటేల్ ను వెంటనే విడుదల చేయాలని లేకుంటే జైల్‌ భరో కార్యక్రమాన్ని చేపడతామని పటేళ్లు హెచ్చరించారు. శనివారం మధ్యాహ్నం నుంచే ఈ బ్యాన్‌ అమల్లోకి వచ్చింది.
« PREV
NEXT »

No comments

Post a Comment