తాజా వార్తలు

Sunday, 6 September 2015

అమీన్ పూర్ పెద్ద చెరువుకు మహర్ధశ

మెదక్ జిల్లా పటాన్‌చెరు మండలం అమీన్‌పూర్‌లో మంత్రి హరీష్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా అమీన్‌పూర్ పెద్ద చెరువు కట్టపై మంత్రి మొక్కలు నాటారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పని చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ చెరువును తేజ్‌దీప్ కౌర్ వెలుగులోకి తీసుకొచ్చారని చెప్పారు. అమీన్‌పూర్ పెద్ద చెరువు బాగు చేయడానికి కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అమీన్‌పూర్ చెరువులో 9 రకాల చేపలున్నాయి. చెరువు చుట్టూ అరుదైన జీవజాలం ఉంది. ఈ క్రమంలో చెరువును కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. స్వచ్ఛమైన నీరు చెరువులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రూ. 3 కోట్లతో అమీన్‌పూర్ పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. చెరువు అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి రూ. 12 లక్షలు విరాళం ఇచ్చారని గుర్తు చేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment