తాజా వార్తలు

Tuesday, 15 September 2015

హరీష్ రావు తీరుతో తలనొప్పులు ....!!!
తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు తీరుతో తీవ్రంగా విసిగిపోతున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు. ఎంతైనా కేసీఆర్ మేనల్లుడు, రాష్ట్ర మంత్రి కాబట్టి... ఆయనతో ఎన్నో రకాల తలనొప్పులు ఉండవచ్చు. మరి ఆ రకమైన తలనొప్పుల సంగతి ఎలా ఉన్నా... మరో వ్యవహారం మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి నేతలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఈ విషయంలో వారు కక్కలేని, మింగలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఏం మాట్లాడాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. ప్రత్యేకించి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలకు ఈ ఇబ్బంది కలుగుతోంది. ఇంతకీ మ్యాటరేమిటంటే.. జిల్లాకు వచ్చే అభివృద్ధి నిధులన్నింటినీ హరీష్ రావు సొంతం చేసుకొంటున్నాడు. జిల్లాల్లో ఉన్న నియోజకవర్గాల సంఖ్యను బట్టి పంచుకోవాల్సిన ఈ నిధులను హరీష్ లాక్కుపోతున్నాడు. మరి వాటిని సొంతానికి వాడుకోవడం లేదు కానీ.. వాటన్నింటినీ సిద్దిపేట నియోజకవర్గంలో ఖర్చుపెడుతున్నాడు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం వెచ్చిస్తున్నాడు. దీంతో మిగతా వాళ్లు నోరెళ్లబెట్టాల్సి వస్తోంది.  జిల్లాకు మొత్తంగా వచ్చే నిధులు ఇలా హరీష్ పాలవుతుండటంతో మిగతా నియోజకవర్గాల్లో ఖర్చుపెట్టుకోవడానికి డబ్బులు లేకుండా పోతోంది. అధికారులపై ఒత్తిడి తెచ్చి.. ఎవరికీ అవకాశం లేకుండా నిధులన్నింటినీ తన నియోజకవర్గానికి తరలిస్తున్నాడు హరీష్. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకే కాదు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అభివృద్ధికార్యక్రమాలకు సంబంధించిన నిధులను ఆయన దక్కనీయడం లేదు. సమంగా పంపకం కావాల్సిన నిధులను ఇలా తన శక్తితో తన నియోజకవర్గానికి తరలించుకొంటూ.. తను మాత్రం క్రెడిట్ కొట్టేస్తున్నాడు. దీంతో నిధులన్ని సిద్ధిపేటకు పోవడంతో... మిగతా నియోజకవర్గాలకు ఎండిపోతున్నాయి. అతివృష్టి, అనావృష్టి అన్నట్టుగా... సిద్దిపేటకు అతివృష్టి లా నిధులు కురిపిస్తూ.. తన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటున్న హరీష్.. మిగతా వాళ్లకు నిధులు దక్కనీయకుండా చేసి భయపెడుతున్నాడు!
« PREV
NEXT »

No comments

Post a Comment