తాజా వార్తలు

Saturday, 19 September 2015

హల్మెట్ లేకపోతే రిజిస్టేషన్ లేదు

హైదరాబాద్ ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయం వద్ద హెల్మెట్  అవగాహన ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. ర్యాలీని రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ ప్రారంభించారు. ఆర్టీఓ కార్యాలయంలోని హెల్మెట్ లేనిదే ప్రవేశం లేదని, వాహనాల కొనుగోలు, రిజిస్టేషన్‌కు అనుమతి లేదని తేల్చి చెప్పారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ కచ్చితంగా ధరించాలని తెలిపారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే 25 శాతం ప్రమాద మరణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment