తాజా వార్తలు

Saturday, 12 September 2015

హోరాహోరీ రివ్యూ

హోరాహోరీ సినిమాలో హీరో ఏడ్వడం తప్ప మరేమీ చేయలేడా అనిపించేంతగా ఏడిపించాడు తేజ. హీరోయిన్ దక్ష కొన్ని సీన్స్ లో పర్వాలేదనిపించింది. ఈ సినిమాలో కన్నడ ఆర్టిస్ట్ చస్వా చాలా బాగా చేసాడు. విలన్ అంటే పెద్దగా అరవడం కండలు పెంచుకొని తిరగడం.. అడ్డు వచ్చిన వారిని నరకడం .. లాంటివి కాకుండా చస్వాకి నటించే అవకాశం ఉన్న సన్నివేశాలను కల్పించాడు తేజ. అందులో అతని నటన ప్రేక్షకులకు నచ్చుతుంది. ఒక ప్రాబ్లమ్ తో హీరోయిన్ ఒక ఊరికి రావడం.. అక్కడ హీరో పరిచయం అవడం.. అది ప్రేమగా మారడం.. హీరోయిన్ ను వెతుక్కుంటూ విలన్ అక్కడికే రావడం.. కాస్త బంగారు బుల్లోడు ట్రాక్ లో నడిచినా.. కథనం మాత్రం చాలా నీరసంగా సాగింది. బ్యాక్ డ్రాప్ లో వాన రూపంలో రోమాంటిక్ మూడ్ ని క్రియేట్ చేసిన తేజ సన్నివేశాలలో మాత్రం క్రియేట్ చేయలేకపోయాడు. విలన్, హీరో ఇద్దరూ హీరోయిన్ నే ప్రేమించడం అనే లైన్ మీద వందలకొద్దీ కథలు వచ్చాయి. కానీ హీరో, హీరోయిన్ల మద్య అయిన ప్రేమను కాస్త సెన్సిబుల్ గా నడపలేకపోయాడు.

ఇక కథలోకి వెళితే... ఒక అవీనీతి పరుడైన పోలీస్ ఆఫీసర్ ఇంటికి లంచం ఇచ్చేందుకు వెళ్ళిన బసవరాజ్  అనే ఒక పెద్ద రౌడీ తొలిచూపులోనే అతని చెల్లెలు మైథిలిని ప్రేమిస్తాడు. అప్పటినుండి తనను ఎవరు పెళ్ళి చేసుకోవాలనికున్నా చంపుతుంటాడు. ఒకర్ని పీటల మీద చంపిస్తే మరొకర్ని పెళ్ళి చూపులప్పుడు చంపిస్తాడు. దీంతో షాక్ కి గురైన మైథిని ఎవర్నీ గుర్తు పట్టడం.. మాట్లాడటం మానేస్తుంది. ఆమె పరిస్థతి మారాలంటే పరిసరాలను మార్చాలని కర్నాటకలోని అగుంబా అనే ఒక మారుమూల ప్రాంతానికి అమ్ముమ్మ తాతయ్యలతో పంపిస్తారు. అక్కడ స్కంధ అనే కుర్రాడు ప్రింటింగ్ ప్రెస్ నడుపకుంటుంటాడు. అతని నాయనమ్మ, అత్తయ్యలతో కలసి ఉంటాడు. స్కంధకు అతని పిలుపుకు స్పందిస్తుంది. అతని స్నేహంతో మామూలవుతుంది. అక్కడికే ఒక సెటిల్ మెంట్ కి వచ్చిన బసవకు స్కంధ పరిచయం అవుతాడు. అతనకి లవ్ గురు అవుతాడు. మరి ఇద్దరు ప్రేమించింది మైథిలినే అని తెలిస్తే ఏమవుతంది అనేది మిగిలినకథ ..

« PREV
NEXT »

No comments

Post a Comment