తాజా వార్తలు

Friday, 25 September 2015

నిమజ్జనం-ట్రాఫిక్ మల్లింపు

గణేష్‌ నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. నిమజ్జనోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 8గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ప్రధానంగా ఊరేగింపు సాగే ప్రాంతాలను మూడు మార్గాలుగా విభజించారు. మొదటి మార్గంలో కేశవగిరి నుంచి అలియా బాద్‌, నాగుల్‌ చింత, చార్మినార్‌, మదీనా, అఫ్జల్‌ గంజ్‌, మొజాం జాహీ మార్కెట్‌, అబిడ్స్‌, బషీర్‌ బాగ్‌, లిబర్టీ మీదుగా గణేష్‌ విగ్రహాలు అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ కు చేరుకుంటాయి. రెండో మార్గమైన సికింద్రాబాద్‌ ఏరియా నుంచి వచ్చే గణనాథులు ఆర్‌పీ రోడ్‌- ఎంజీ రోడ్‌, కర్బలా మైదాన్‌, కవాడీగుడా, ముషీరాబాద్‌ క్రాస్‌ రోడ్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌, నారాయణగూడ క్రాస్‌ రోడ్‌, హిమాయత్‌ నగర్‌ వై జంక్షన్‌ మీదుగా ట్యాంక్‌ బండ్‌కు చేరుకుంటాయి. మూడో మార్గంలో ఉప్పల్‌ నుంచి వచ్చే వినాయక విగ్రహాలను రామంతాపూర్‌, అంబర్‌ పేట్‌, NCC గేట్‌, దుర్గాబాయ్‌ దేశ్‌ ముఖ్ హాస్పిటల్‌ మీదుగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ కు చేరుకుని సికింద్రాబాద్‌ నుంచి వచ్చే ఊరేగింపులో కలుస్తాయి. నగరం పశ్చిమం వైపు నుంచి వచ్చే విగ్రహాలు మోజం జాహీ మార్కెట్‌, సెక్రటేరియట్‌ వద్ద ప్రధాన మార్గంలో కలుస్తాయి.  హైదరాబాద్‌ సౌత్‌ పరిధిలోని కేశవగిరి, మహబూబ్‌నగర్‌ క్రాస్‌ రోడ్స్‌, ఇంజన్‌ బౌలి, నాగుల్‌ చింత, హిమ్మత్‌ పుర, హరిబౌలి, అస్ర హాస్పిటల్‌, మొఘల్‌ పుర, మదీనా క్రాస్‌ రోడ్‌, ఎంజే బ్రిడ్జ్‌, దారుల్‌ షిఫా క్రాస్‌ రోడ్‌, సిటీ కాలేజ్‌ ప్రాంతాల్లో వాహనాలను అనుమతించరు. హైదరాబాద్‌ ఈస్ట్‌లో చంచల్‌ గూడ జైల్‌ క్రాస్‌ రోడ్స్‌, మూసారాంబాగ్‌, చాదర్‌ ఘాట్‌ బ్రిడ్జ్‌, సాలార్జంగ్‌ బ్రిడ్జ్‌, అఫ్జల్‌ గంజ్‌, పుత్లిబౌలీ క్రాస్‌ రోడ్‌, ట్రూప్‌ బజార్‌, జాంబాగ్‌ క్రాస్‌ రోడ్‌ కోఠి ఆంధ్రాబ్యాంక్‌ వరకు నిమజ్జనాకి వచ్చే వెహికిల్స్‌ తప్పించి మరే వాహనాలకు అనుమతిలేదు. హైదరాబాద్‌ వెస్ట్‌ పరిధిలోని తోప్‌ఖానా మసీద్‌, అలాస్కా హోటల్‌ జంక్షన్‌, ఉస్మాన్‌ గంజ్‌, శంకర్‌ బాగా షీనా హోటల్‌, ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ అజంతా గేట్‌, ఆబ్కారీ లైన్‌, తాజ్‌ ఐలాండ్‌ బర్తన్‌ బజార్‌, ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌, కేఎల్‌ కే బిల్డింగ్‌ వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ పరిథిలోని చాపెల్‌ రోడ్‌, జీపీఓ, షాలిమార్‌ థియేటర్‌, గన్ ఫౌండ్రీ, స్కైలైన్‌ రోడ్‌ ఎంట్రీ, దోమల్‌గూడలోని భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ జంక్షన్‌, కంట్రోల్‌ రూం, లిబర్టీ జంక్షన్, MCH ఆఫీస్‌ వై జంక్షన్‌, BRK భవన్‌ జంక్షన్‌, ఇక్బాల్‌ మినార్‌, రవీంద్ర భారతి, ద్వారకా హోటల్‌ జంక్షన్‌, ఖైరతాబాద్‌ జంక్షన్‌, చిల్డ్రన్‌ పార్క్‌, విక్టరీ హోటల్‌ జంక్షన్‌, కవాడిగూడ జంక్షన్‌, ముషీరాబాద్‌ క్రాస్‌ రోడ్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌, లోయర్‌ ట్యాంక్‌ బండ్‌లోని కట్టమైసమ్మ టెంపుల్‌, ఇందిరా పార్క్‌ జంక్షన్‌ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను అనుమతించరు. ఇక హైదరాబాద్‌ నార్త్‌లోని కర్భలా మైదాన్‌, బుద్ధ భవన్‌, సెయిలింగ్‌ క్లబ్‌, నల్లగుట్ట జంక్షన్‌, నుంచి నెక్లెస్‌ రోడ్‌, అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. ప్రధాన కూడళ్లు అయిన CTO, YMCA, ప్యారడైజ్‌ క్రాస్‌ రోడ్స్‌, ప్యాట్నీ క్రాస్‌ రోడ్స్‌, బాటా క్రాస్‌ రోడ్స్‌, ఘాస్‌ మండీ క్రాస్‌ రోడ్స్‌ లలో 27వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచే ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి వస్తాయి.
28వ తేదీ ఉదయం పరిస్థితులను బట్టి ట్రాఫిక్‌ ఆంక్షలను కొనసాగించే అవకాశముంది. 

« PREV
NEXT »

No comments

Post a Comment