తాజా వార్తలు

Wednesday, 16 September 2015

ఇందిరాగాంధీ, రాజీవ్ స్టాంపులకు గుడ్ బై ఎన్డీఏ ప్రభుత్వం

ఇందిరాగాంధీ, రాజీవ్ స్టాంపులకు ఎన్డీఏ ప్రభుత్వం ఇక గుడ్ బై చెప్పేసింది. దేశానికి సేవలందించిన ఎందరో ప్రముఖుల పేర్లపై పోస్టల్ స్టాంపులు తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రత్యేక సందర్భాల్లో విడుదలయ్యే స్టాంపులకు భిన్నంగా.. రెగ్యులర్ సర్వీసుల కోసం ఉపయోగించేలా సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు.  పోస్టల్ స్టాంపుల ప్రింటింగ్ లో ఎన్డీఏ ప్రభుత్వం సరికొత్త దిశలో వెళ్లాలనుకుంటోంది. మోడ్రన్ థీమ్ తో ఆలోచిస్తోంది. ఈ క్రమంలో రెగ్యులర్ సర్వీసులకు ఉపయోగించే పోస్టల్ స్టాంపుల్లో భారీ మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇందిర, రాజీవ్ పేర్లతో ఉన్న స్టాంపులను నిలిపేయాలని నిర్ణయించారు. అదే సమయంలో దేశానికి సేవలందించిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, నేతాజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, శివాజీ, మౌలానా ఆజాద్, భగత్ సింగ్, వివేకానంద, మహారాణా ప్రతాప్, జయ ప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా వంటి ప్రముఖుల పేర్లతో స్టాంపుల విడుదలకు రంగం సిద్ధమవుతోంది. అటు.. ఇందిర, రాజీవ్ స్టాంపులను నిలిపేయడంపై కాంగ్రెస్ మండిపడుతోంది. 
« PREV
NEXT »

No comments

Post a Comment