తాజా వార్తలు

Monday, 7 September 2015

తెలంగాణకు పాకిన సూదిగాళ్ల అరాచకం

నల్లగొండ జిల్లాలోని కోదాడ మండలం కాపుగల్లులో ఇవాళ సూదిగాళ్లు కలకలం సృష్టించారు. ఆటోలో వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని ఆగంతకులు వీరయ్య అనే రైతు కంట్లో సూదితో గుచ్చి పారిపోయారు. బాధిత రైతును ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి ప్రాంతంలో ఓ విద్యార్థినిని గుర్తు తెలియని దుండుగులు ఇంజక్షన్‌తో గుచ్చి కలకలం రేపిన సంఘటనను మరవక ముందే నల్లగొండ జిల్లాలో మరో సూది సంఘటన జరగడం కలకలం రేపుతుంది.  
« PREV
NEXT »

No comments

Post a Comment