తాజా వార్తలు

Tuesday, 29 September 2015

ఐఫోన్ 6ఎస్ రేటు చాలా హాట్ గురూ....!ధర బాగా ఎక్కువైనా.... ఆండ్రాయిడ్ తో పోల్చితే ఓఎస్ పరంగా ఎన్నో ఇబ్బందులున్న ఐఫోన్లంటే క్రేజ్ మాత్రం బాగా ఎక్కువ. ఐఫోన్ కోసం ఆస్తులు అమ్ముకున్నవారు - దొంగతనాలు చేసినవారు - ఆత్మహత్యలు చేసుకున్నవారు కూడా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆ రేంజిలో క్రేజ్ ఉన్న ఐఫోన్లలో ఏ ఎడిషన్ వస్తున్నా రెండు నెలల ముందే అది హాట్ టాపిక్ అయి కూర్చుంటుంది. దాని రిలీజ్ డేట్ ఎప్పుడు... ఎలా ఉంటుంది.. రేటెంత వంటివన్నీ చర్చనీయాంశాలే.. ఐఫోన్ అనేది స్టేటస్ సింబల్ గా కూడా మారిపోయిందిప్పుడు. చేతిలో ఐఫోన్ పట్టుకుని కారు దిగితే ఆ రేంజే వేరు అంటుంటారు కొందరు. అలాంటి ఐఫోన్లలో ఇప్పటికే పలు మోడళ్లు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా కొద్ది రోజుల్లో ఐఫోన్ 6ఎస్ ను మార్కెట్ లోకి విడుదల చేయనుండడంతో దానకోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. దీన్ని ఇండియాలో అక్టోబరు 15న విడుదల చేస్తారని సమాచారం... అంతేకాదు ఆరు వేరియంట్లలో ఇది దొరుకుతుంది. మినిమమ్ ప్రైస్ 62 వేలు కాగా హయ్యెస్ట్ ప్రైస్ 92 వేలు. ఇంకేముంది డబ్బులు రెడీ చేసుకోండి... ఇంకో రెండు వారాల్లో కొత్త యాపిల్ వచ్చేస్తోంది.

ఏ వేరియంట్ ధర ఎంత..

- -ఐఫోన్ 6ఎస్(16 జీబీ).. 62 వేల రూపాయలు

- - ఐఫోన్ 6ఎస్(46 జీబీ).. 72 వేలు

- - ఐఫోన్ 6ఎస్(128 జీబీ)... 82 వేలు

- - ఐఫోన్ 6ఎస్ ప్లస్(16 జీబీ)... 72 వేలు

- - ఐఫోన్ 6ఎస్ ప్లస్ (64 జీబీ)  82 వేలు

- - ఐఫోన్ 6ఎస్ ప్లస్ (128 జీబీ)  92 వేలు
News National Bureau

« PREV
NEXT »

No comments

Post a Comment