తాజా వార్తలు

Monday, 21 September 2015

ఇంజనీరింగ్ నిరుద్యోగులకు శుభవార్త

విద్యుత్ శాఖలో ఏఈ పోస్టుల భర్తీకి ఇవాళ నోటిఫికేషన్‌ను మంత్రి జగదీశ్‌రెడ్డి విడుదల చేశారు. 1422 ఏఈ పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్టు మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ట్రాన్స్‌కోలో 124 ఎలక్ట్రికల్, 22 సివిల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలవుతుందని పేర్కొన్నారు. మొత్తం 962 ఎలక్ట్రికల్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. జేఎన్డీయూ ఆధ్వర్యంలో పరీక్షను నిర్వహిస్తామని వెల్లడించారు. మెకానికల్ 195 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. డిసెంబర్‌లోగా నియామకాల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఉద్యోగాలకు కొత్తగా ఎన్నికైన అభ్యర్తులందరూ జవనరి 1 నుంచి అందరూ విధుల్లో చేరే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. ఎన్‌పీడీసీఎల్ అభ్యర్థులకు నవంబర్ 8న పరీక్ష జరుగుతుందని తెలిపారు. జెన్‌కో అభ్యర్థులకు నవంబర్ 14న,ఎస్‌పీడీసీఎల్ అభ్యర్థులకు నవంబర్ 19న పరీక్ష ఉంటుందని తెలిపారు. వివరాలన్ని వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని పేర్కొన్నారు. విద్యుత్‌శాఖలో పోస్టుల భర్తీలో బ్రోకర్లు, ఫైరవీలకు ఆస్కారం లేదన్నారు. అలాంటిదేక్కడైనా కనిపిస్తే తమకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇందు కోసం మొబైల్ నెంబర్‌ను ఏర్పాటు చేశామని ఎవరైనా అభ్యర్థులను ప్రలోభ పెడుతున్నట్టు తెలిస్తే మొబైల్ నెంబర్ 8332983914కు ఫోన్ చేయాలని సూచించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment