తాజా వార్తలు

Tuesday, 1 September 2015

చంద్రబాబుకు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన జగన్

అసెంబ్లీలో వైఎస్ జగన్ విశ్వరూపాన్ని ప్రదర్శించారు. సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై ఒంటికాలిపై లేచి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. చంద్రబాబు చేసిన ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామా చేస్తానన్నరు.
 •  ప్రత్యేకహోదాపై వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ మేరకు బాబు సర్కార్ ప్రకటన చేసింది. ఐతే, బాబు చేసిన ప్రసంగంపై వైఎస్ జగన్ మాట్లాడుతూ..ప్రత్యేహోదాపై చంద్రబాబుకు అవగాహన లేదన్న విషయం ఇవాళ వెల్లడైందన్నారు. ప్రత్యేక హోదావల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాల గురించి జగన్ సభలో వివరించారు.  ఓటుకు నోటు కేసు సహా అనేక అంశాలపై   బాబు అవినీతిని సభలో నిలదీశారు. దీంతో, అధికారపార్టీసభ్యులు ఒంటికాలిపై లేచారు. జగన్ పై వ్యక్తిగత దూషణలకు దిగారు. సభా నియమాలను మంటగల్పారు. ప్రభుత్వం అరాచకాలను సభాముఖంగా వైఎస్ జగన్ బయటపెట్టారు. ..ఆయనేం మాట్లాడారంటే..!
 • చంద్రబాబు సగంసగం చెప్పడం..మనం వినాల్సిరావడం మన కర్మ : వైఎస్ జగన్
 • సరిగ్గా ఇదే రోజు మామకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి.. విలువల గురించి మాకు చెప్పడం సిగ్గుచేటు 
 • ప్రజాసమస్యలపై కాకుండా బాబు ఓటుకు నోటుపైనే ఎక్కువగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు
 • ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టేపు సంభాషణలను సభలో చదివి వినిపించిన వైఎస్ జగన్
 • ఓటుకు నోటు కేసులో లంచాలు పుచ్చుకొని ఇష్టమొచ్చినట్లు ఖర్చుచేసి పట్టుబడ్డారు.
 • బ్యాంకుల్లో బంగారం రావాలంటే, జాబు రావాలంటే బాబు రావాలి అని గోడల మీద కనిపించేది ,టీవీల్లో వినిపించేది
 • చంద్రబాబు మైక్ పట్టుకుంటే హామీలే వినిపించేవి
 • విభజన సమయంలో  బాబు తమ మంత్రుల చేత లోక్ సభలో ఓమాట, రాజ్యసభలో ఓ మాట మాట్లాడించారు
 • 10 ఏళ్ల పాటు ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి రాష్ట్రాన్ని విభజించారు
 • 15 నెలలైంది ఇప్పటివరకు బాబు ప్రత్యేకహోదా ఎప్పుడు తెస్తారో చెప్పడం లేదు
 • పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగానే ఉంటుందన్న చందంగా టీడీపీ తీరు ఉంది
 • ప్రత్యేకహోదాపై బాబుకు అవగాహన లేదన్న విషయం ఇవాళ తేలిపోయింది
 • ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ బాబు తుంగలో తొక్కారు
 • పట్టిసీమ నుంచి ఇసుకమాఫియా దాకా..మట్టి నుంచి బొగ్గు దాకా పర్సంటేజీలు, కమీషన్లే
 • ఎంక చేసుకొని డిస్టరీలు కేటాయించేదాకా ప్రభుత్వం అవినీతి బాగోతం కొనసాగుతోంది
 • ప్రత్యేకహోదావల్ల కలిగే లాభాలను సభలో వివరించిన వైఎస్ జగన్
 • ప్రత్యేకహోదా వస్తే కేంద్రప్రభుత్వం నుంచి 90 శాతం గ్రాంట్లు..10 శాతం రుణాలు వస్తాయి
 • మోడీ దయదలిస్తే ఎంత పెద్ద ప్యాకేజీ అయినా వస్తుంది
 • ప్రత్యేకహోదా గల రాష్ట్రానికి ఇచ్చే నిధుల విషయంలో ఓ ఫార్ములా అంటూ లేదు
 • గత కేటాయింపుల ఆధారంగా నిధులిస్తారు
 • జమ్ముకాశ్మీర్ కు ప్రధాని రూ.70 వేల కోట్లు ఇచ్చారు
 • కేంద్రానికి నెలరోజుల టైమివ్వండి..హోదా ఇవ్వకపోతే   మంత్రులను ఉపసంహరించుకోండి 
 • ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్..?
 • కేసీఆర్ కు లేఖ ఇచ్చాడంటూ అచ్చెన్నాయుడు ఆరోపణ..?
 • లేఖ ఇచ్చినట్లు నిరూపిస్తే   రాజీనామాకు సిద్ధం..?
 • లేఖ ఇచ్చినట్లు అచ్చెన్నాయుడుకు కేసీఆర్ ఏమైనా చెప్పాడా..?
 • స్పీఫెన్ సన్ కు ఎమ్మెల్సీ ఇవ్వాలని జగన్ కేసీఆర్ కు లేఖ ఇచ్చాడంటూ అచ్చెన్నాయుడు ఆరోపణ
 • లేఖ ఇచ్చినట్లు నిరూపిస్తే   రాజీనామాకు సిద్ధం: వైఎస్ జగన్
 • లేఖ ఇచ్చినట్లు అచ్చెన్నాయుడుకు కేసీఆర్ ఏమైనా చెప్పాడా..!: వైఎస్ జగన్
« PREV
NEXT »

No comments

Post a Comment