తాజా వార్తలు

Wednesday, 16 September 2015

మక్కాలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులను పరామర్శించిన వైఎస్ జగన్

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నంలో పర్యటిస్తున్నరు. వైఎస్సార్సీపీ నేతలు అధినేతకు ఘనస్వాగతం పలికారు. పేర్నినాని ఆధ్వర్యంలో వాహనాలతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. భూసేకరణ బాధితులకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ మచిలీపట్నం పర్యటనకు వచ్చారు. గన్నవరం  విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డుమార్గాన జగన్ మచిలీపట్నం చేరుకున్నారు. 
మక్కాలో మృతిచెందిన అబ్దుల్ ఖాదిర్, ఫాతిమా కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. వారి కుటుంబసభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి హజ్ యాత్ర మృతులను పట్టించుకోకపోవడం దారుణమని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఒక్కొక్కరికి రూ.8 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment