తాజా వార్తలు

Monday, 28 September 2015

30న ప్రకాశం జిల్లాలో జగన్ పర్యటన

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 30న ప్రకాశం జిల్లాకు వెళ్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నపొగాకు రైతుల కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తారు. పొగాకు రైతులకు భరోసానిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్ జగన్ జిల్లాలో పర్యటిస్తారని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈమేరకు ప్రకటించారు. గిట్టుబాటు ధర లేక జిల్లాలో పొగాకు రైతులు చనిపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని అశోక్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే దీనిపై తమ ఎంపీ వైవి సుబ్బారెడ్డి పలుమార్లు కేంద్రమంత్రులకు విన్నవించారని చెప్పారు. జిల్లాకు వచ్చినప్పుడు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని అశోక్ రెడ్డి అన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment