తాజా వార్తలు

Friday, 25 September 2015

వైఎస్ జగన్ నిరవధిక దీక్షపై స్పస్పెన్స్

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ శనివారం నుంచి  గుంటూరులో చేపట్టనున్న నిరవధిక దీక్షపై సందిగ్ధత నెలకొంది. జగన్ దీక్షకు అనుమతి నిరాకరంచిన పోలీసులు...ఊల్ఫ్ గ్రౌండ్‌లో  చేస్తున్న  ఏర్పాట్లను అడ్డుకున్నారు. దీక్షా స్థలం వద్ద ఏర్పాటు చేసిన జగన్ ఫ్లెక్సీలను కార్పోరేషన్ సిబ్బంది తొలగించారు. దీంతో  గుంటూరులో రోజంతా హైడ్రామా నడిచింది. జగన్‌ దీక్షపై వైసీపీ నేతలు, పోలీసుల మధ్య మాటల యుద్ధం నడిచింది. దీక్షను చేపట్టి తీరతామని వైసీపీ, అడ్డుకుంటామని పోలీసులు ప్రకటించడంతో ఊల్ఫ్ గ్రౌండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. 
« PREV
NEXT »

No comments

Post a Comment