తాజా వార్తలు

Saturday, 5 September 2015

ప్రత్యేకహోదా కోసం వైఎస్ జగన్ త్వరలో నిరవధిక దీక్ష..?

ప్రత్యేకహోదా సాధన కోసం ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో పోరాటానికి సిద్ధమయ్యారు. స్పెషల్ స్టేటస్ కోసం నిరవధిక నిరహార దీక్షకు దిగనున్నరు. ఈనెల 19 లేదా 20వ తేదీ నుంచి దీక్ష  ప్రారంభించే అకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఈనెల 17న వినాయకచవితి ఉన్నదృష్ట్యా పార్టీ నేతల సూచనల మేరకు మొదట ప్రకటించిన తేదీని వాయిదా వేసుకున్నట్లు స్పష్టం చేశారు. దీక్షకు సంబంధించిన అన్ని వివరాలు తమ పార్టీనేతలు త్వరలోనే ధృవీకరిస్తారని అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన విలేకరులు సమావేశంలో వైఎస్ జగన్ తెలిపారు. సభలో ప్రత్యేక హోదా తీర్మానానికి ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఐతే, తీర్మానికి బలం రావాలంటే కేంద్రంలో మంత్రి పదవులను ఉపసంహరించుకోవాలని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 15 వరకు చంద్రబాబుకు డెడ్ లైన్ విధించారు. ఈలోగా హోదా రాకుంటే గుంటూరు వేదికగా నిరవధిక నిరహార దీక్ష చేస్తానని ప్రకటించారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment