తాజా వార్తలు

Thursday, 24 September 2015

వాళ్ల మీటింగ్ రామోజీకే లాభమా....!???తమ అధినేతల మీటింగుల వివరాలు దాచడం పత్రికల కేమీ కొత్త కాదు. తమ వాళ్లు ఫలనా వ్యక్తి కలిసినట్టు జనాలకు తెలిస్తే అది తమ వాళ్లకే నష్టం అవుతుందని ఈ మీడియా వర్గాలు భావించాయంటే... ఆ వార్తను దాచేస్తాయి. ఇది వరకూ ఇలాంటివి అనేకం జరిగాయి. ఉదాహరణకు ఆ మధ్య ఈనాడు కిరణ్ వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం అయితే ఈనాడులో వార్తే లేదు! కేసీఆర్ కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ సమావేశం జరిగింది.
మిగతా మీడియా వర్గాలు ఆ విషయాన్ని హైలెట్ చేయగా... ఈనాడులో మాత్రం దాచేశారు. అసలు కిరణ్ వెళ్లి కేసీఆర్ ను కలిసినట్టుగా ఆ పత్రికల్లో వార్తే లేదు! మరి తమ వాడు సీఎంను కలిశాడని తమ పత్రికలో వార్తేసుకొంటే జనాల్లో ఏం చెడ్డపేరు వస్తుందని అనుకొన్నారో కానీ.. ఈనాడులో అది వార్తగా చూపలేదు. అయితే ఈనాడు చూపనంత మాత్రాన వార్త వార్త కాకుండా పోదు కదా!
మరి ఇప్పుడు మళ్లీ అదే జరిగింది. ఈ సారి రెండు ప్రముఖ పత్రికలూ తమ వాళ్ల మీటింగ్ వార్తను దాచేశాయి. రామోజీ, వైఎస్ జగన్ ల మీటింగ్ గురించి... ఈనాడులోనూ వార్తలేదు, సాక్షిలోనూ వార్తలేదు! ఒకవైపు గురువారం సాయంత్రం నుంచి ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఉప్పూనిప్పుల్లాంటి వాళ్లు కలవడం ఏమిటి? ఎందుకు? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి నేపథ్యంలో కూడా ఆ పత్రికలు గుంభనంగా ఉండిపోయాయి. జగన్ ఫిల్మ్ సిటీకి వచ్చినట్టుగా ఈనాడు రాయలేదు.
ఇలా రెండు పత్రికలూ ఈ వార్తను హైడ్ చేయడంతో దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వనక్కర్లేదని ఇద్దరూ భావిస్తున్నారని అనుకోవాలి. ఒకవేళ జగన్ తన అవసరం మేరకే.. రామోజీని కలిసి ఉంటే.. ఈనాడు పత్రిక కచ్చితంగా దీన్ని వార్తగా మలిచేది. ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఫిల్మ్ సిటీకి వచ్చాడని.. ఈనాడు గ్రూప్ అధిపతి రామోజీని కలిశాడని ఈనాడు రాసుకునేది. అయితే అది జరగలేదు.  దీంతో ఇది వారి వ్యక్తిగత భేటీ అనుకోవాల్సి వస్తోంది. బహుశా కత్తులుదూసుకునే శత్రుత్వానికి బ్రేకప్ చెప్పడానికే ఈ మీటింగ్ జరిగేందనే అభిప్రాయాలకు ఇప్పుడు బలం చేకూరుతోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment