తాజా వార్తలు

Saturday, 19 September 2015

పరిటాల శ్రీరామ్ - జేసీ బ్రదర్స్ వర్గాల మద్య రాసుకుంటున్న వేడి....!
‘‘అన్ని మ్యాటర్‌లలోకీ వేలు పెట్టేందుకు వాడెవడు... వాడి వయసెంత? వాడొక బచ్చా.. అన్నింట్లోనూ జోక్యం చేసుకుంటాడా? మా నియోజకవర్గాల జోలికి రావడానికి ఎంత ధైర్యం?’’ అంటున్నారు జేసీ బ్రదర్స్. పరిటాల శ్రీరామ్ విషయంలో సరిగ్గా ఇవే మాటలను ఉపయోగించి.. తమదైన శైలిలో పరిటాల రవి తనయుడిపై విరుచుకుపడుతున్నారు. ఒక విషయం అని కాదు.. అనేక వ్యవహారాల్లో పరిటాల శ్రీరామ్ జోక్యం చేసుకుండటంతో జేసీ వర్గీయులు సహించలేకపోతున్నారు.  దివాకర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ఏ నియోజకవర్గంలోనూ శ్రీరామ్ జోక్యం చేసుకోకూడదు.. అనేది వీరి కోరిక. అయితే ఇలాంటి పరిమితులను పరిటాల వర్గం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవడం లేదు! ‘‘వాళ్లెవ్వరు.. నిన్నలా మొన్న వచ్చారు. ఇన్నేండ్లూ కాంగ్రెస్‌లో ఉండి.. మమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టి ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చి.. పార్టీ పేరుతో గెలిచారు. వాళ్లకు లభించిన పదవులే ఎక్కువ. వాళ్లకు అదే పెద్దభిక్ష..’’ అంటున్నారు పరిటాల వర్గీయులు! జేసీ అనంతపురం ఎంపీగా ఉండటం.. ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉండటం కూడా తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్ష.. కాబట్టి వారు తమ హద్దుల్లో తాముంటే మంచిది.. మాకు ఎదురు రాకుంటే పద్ధతిగా ఉంటుంది... పరిటాల శ్రీరామ్ వైపు నుంచి వినిపిస్తున్న హెచ్చరికలు ఇవి.  పరిటాల శ్రీరామ్‌ను జేసీ వర్గీయులు బచ్చా అంటుంటే... వాళ్లకు తామే భిక్షం వేశామని పరిటాల వాళ్లు అంటున్నారు. ఈ విధంగా ఎవరికి వారు... ఒకరిపై మరొకరు దుమ్ముత్తిపోసుకొంటూ ముందుకు సాగుతున్నారు తెలుగుదేశం నేతలు. ఎవరికి వారు జిల్లాపై తమదే ఆధిపత్యం ఉండాలంటూ పరస్పరం దూషించుకొంటూ.. ఒకరిపై మరొకరు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకొంటూ ముందుకు సాగుతున్నారు. మరి చివరకు ఈ పోరాటంలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి! 
« PREV
NEXT »

No comments

Post a Comment