తాజా వార్తలు

Tuesday, 29 September 2015

రుణమాఫీ ఒకే సారి చేయండి-జీవన్ రెడ్డి

సమైక్యపాలనలో తెలంగాణ వివక్షకు గురైందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గురైందని చెప్పారు. వర్షభావ పరిస్థితులవల్లే పంటలు పండక దిగుబడి రాలేదన్నారు. రైతుల ఆత్మహత్యలు దురదృష్టకరమన్న జీవన్ రెడ్డి.. రుణమాఫీని దశలవారిగాకాకుండా ఒకేసారి అమలు చేసే అంశాన్ని సర్కారు పరిశీలించాలని సూచించారు. నిరుపేద రైతులకు హెల్త్‌కార్డులు ఇస్తే బాగుంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు కొత్తగా అప్పులు పుట్టటం లేదని జీవన్‌రెడ్డి అన్నారు. మగళవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో జీవన్‌రెడ్డి తెలంగాణలో రైతుల సమస్యలను ప్రస్తావించారు. రాష్ట్రంలో దశలవారీగా రుణమాఫీ వల్ల రైతులకు ఉపయోగం లేదని అన్నారు. ఒకేసారి రుణమాఫీ గతంలో జరిగిందన్నారు. రైతులకు ఇలాంటి బాధలు రావటానికి కారణం ఎవరని ఆయన సూటిప్రశ్న వేశారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యుత్‌ బకాయలను మాఫీ చేసిందని గుర్తుచేశారు. తెలంగాణలో రైతు సమస్యలు పరిష్కారం అవుతాయని తాము భావించామన్నారు. బీమాతో ఏఒక్కరైతులకు లబ్దిచేకూరిందా అని అన్నారు. మనం తీర్మానం చేయటం వల్ల ఏమీ ఉపయోగం లేదని అది ఆచరణలోకి రావాలని అపుడే రైతుకు లాభసాటి అన్నారు.సోలాల్‌ ఎనర్జీ అంటున్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఎక్కడైనా సోలార్‌ పంపుసెట్లు ఏర్పాటు చేశారా అని అన్నారు. రైతులకు 6 గంటలు విద్యుత్‌ ఇస్తునామంటున్నారు. అసలు 3 గంటలు కూడ మోటార్లు ఆడటం లేదన్నారు. మనం ఏవిధంగా సమస్యలు పరిష్కరించాలో ఆలోచించాలన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment