తాజా వార్తలు

Monday, 7 September 2015

చైనా పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు 10 రోజుల చైనా పర్యటనకోసం సోమవారం బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బృందం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సోమవారం ఉదయం 10 గంటలకు చైనా బయల్దేరి వెళ్లింది. చైనాలోని డాలియన్ నగరంలో ఈ నెల 9నుంచి 11వరకు న్యూ చాంపియన్‌షిప్-2015 పేరిట జరుగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో ఆయన పాల్గొంటారు. రాష్ట్రంలో సమృద్ధిగా ఉన్న మానవ, ప్రకృతి వనరులను ప్రపంచం ముందుంచనున్నారు. ప్రపంచం నలుమూలలనుంచి ఈ సదస్సుకు హాజరయ్యే పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలకు తెలంగాణ నూతన పారిశ్రామిక విధానాన్ని వివరించి, పరిశ్రమల స్థాపనకు కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, సౌకర్యాల గురించి తెలియజేస్తారు. సీఎం చైనా పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment