తాజా వార్తలు

Saturday, 19 September 2015

కేటుగాడు రివ్యూ

కేటుగాడు సప్తగిరి ‘టాక్సీగిరి’ గా చేసిన పాత్ర ప్రేక్షకులని సినిమా మొదటి నుండి చివరి వరకు కొంచెం బోర్ కొట్టకుండా చేస్తుంది. సప్తగిరి కామెడీ సినిమాకి మంచి ప్లస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా హీరో తేజస్ నటన పర్వాలేదనిపించింది. షార్ట్ ఫిలిమ్స్ తర్వాత మొదటిసారి వెండి తెరపై కనిపించిన చాందిని నటన మరియు అందంతో ప్రేక్షకులని ఆకట్టుకుంది. సినిమాలో ఇంటర్వెల్ పార్ట్ కూడా బాగానే ఉంది. రాజీవ్ కనకాల, అజయ్ కూడా బాగానే నటించారు.
కథాంశం..తేజస్.. కార్లు దొంగతనం చేసి అమ్ముకుంటూ సరదాగా జీవితాన్ని వెల్లదీసే ఓ యువకుడు. ఓ కారు దొంగతనం చేసే ప్రయత్నంలోనే చందు, ఒక పార్టీలో అకిరా(చాందినీ)ను చూసి మొదటిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత అదే అమ్మాయి కిడ్నాప్‌కు గురవ్వడం, కిడ్నాప్ అయి ఏ కారులో అయితే బంధించబడి ఉందో ఆ కారునే చందు దొంగతనం చేయడంతో సినిమా ప్రధాన కథ మొదలవుతుంది. మొదట చందుయే తనను కిడ్నాప్ చేశాడని అనుకున్న అకిరాకు ఆ తర్వాత అసలు నిజం తెలుస్తుంది.
అకిరా అన్నయ్య ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ ప్రకాష్ (రాజీవ్ కనకాల), సొంత చెల్లెలిని కిడ్నాప్ చేయడానికి వేసిన ప్లాన్ విఫలమవ్వడంతో, అకిరా చందు జీవితంలోకి వస్తుంది. ఇక చందు, అకిరాల ఈ ప్రయాణం ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీస్తుంది. ఇదిలా ఉంటే అకిరా కోసం ఓ పక్క శ్రీ ప్రకాష్‌తో పాటు అజయ్ (అజయ్) అనే మరో వ్యక్తి కూడా వెతుకుతూ ఉంటాడు. ఇక సొంత చెల్లెలినే శ్రీ ప్రకాష్ ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటాడు? అజయ్ ఎవరు? చాందినీ కోసం అజయ్ ఎందుకు వెతుకుతుంటాడు? చందు, అకిరాల ప్రేమకథ, ఈ కిడ్నాప్ కథ చివరకు ఏమైంది? అన్న ప్రశ్నలకు సమాధానమే ‘కేటుగాడు’.
« PREV
NEXT »

No comments

Post a Comment