తాజా వార్తలు

Saturday, 26 September 2015

మంత్రివర్గంలోకి కోడెల ఇన్ కామినేని శ్రీనివాస్ ఔట్....!!!???
ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇప్పటికే ముళ్లపీఠం మీద కూర్చొన్నట్టుగా ఫీలవుతున్నాడు. ఆయన నేపథ్యాన్ని బట్టి చూస్తే.. అస్సలు స్పీకర్ స్థానం అనేది సూటయ్యేది కాదు.  ఆయన రాజకీయ చరిత్రను గమనించినా ఈ విషయం స్పష్టం అవుతోంది. అయితే ప్రస్తుతానికి ఆయన అసెంబ్లీ స్పీకర్ గా సమావేశాల సమయంలో అటు అధికార, ఇటు ప్రతిపక్షాలను సముదాయిస్తూ... బండి లాగిస్తున్నాడు. జగన్ మోహన్ రెడ్డిగారు.. అంటూ గౌరవించాల్సి వస్తోంది. అదే కోడెల అవతల ఎమ్మెల్యేగానో..మంత్రిగానో.. ఉండి ఉంటే కథ వేరే రకంగా ఉండేదనడంలో సందేహం లేదు. మరి ఇప్పుడు ఆ పాత యాంగిల్ ఆవిష్కృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోడెలను తన మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్నాడట ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు.
తనకు స్పీకర్ స్థానాన్ని కేటాయించడం పట్ల అప్పట్లోనే అసంతృప్తి వ్యక్తం చేసిన కోడెలకు బాబు భవిష్యత్తులో మంత్రి పదవి ఇస్తాననే హామీని ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే జరగనున్న మంత్రివర్గ విస్తరణలో బాబు కోడెలకు ఇచ్చిన హామీని నెరవేర్చనున్నట్టుగా తెలుస్తోంది. గతంలో వైద్య ఆరోగ్య శాఖను నిర్వహించిన కోడెలకు తిరిగి అదే శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని సమాచారం.

ప్రస్తుతానికి ఆ శాఖ కామినేని శ్రీనివాస్ చేతిలో ఉంది. అయితే ఆయన పనితీరుపై విమర్శలు ఉన్నాయి. స్వయంగా బాబు కూడా చాలా అసంతృప్తితో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆయనను ఆ శాఖ బాధ్యతల నుంచి తప్పించి... కోడెలకు ఆ శాఖ బాధ్యతలను అప్పగించనున్నాడట చంద్రబాబు. మరి అదే జరిగితే.. అసెంబ్లీలో కోడెలలోని మరో యాంగిల్ ను చూస్తామేమో...!!!
Newsdesk-special
« PREV
NEXT »

No comments

Post a Comment