తాజా వార్తలు

Wednesday, 9 September 2015

వ‌న్డేల‌కు కూడా కోహ్లీ నే కెప్టెనా..!
టీమ్‌ ఇండియా కొత్తగా అనుసరిస్తున్న దూకుడు వ్యుహం మూలంగా మైదానంలో తలెత్తిన కొన్ని వివాదాలపై స్పందించేందుకు టెస్ట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నిరాకరించాడు. శ్రీలంక పర్యటనలో పేసర్‌ ఇషాంత్‌ శర్మ లంక ఆటగాళ్లతో మైదానంలో కవ్వింపు చర్యలకు దిగటం వివాదస్పదమైంది. భారత మాజీలు బిషన్‌ సింగ్‌ బేడీ, సంజరు మంజ్రేెకర్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌ వంటి వారు ఈవిషయమై ఇప్పటికే విమర్శించారు. బుధవారం ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్‌ కోహ్లి ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడాడు.
ఇషాంత్‌ శర్మ దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌కు దూరమవటం టీమ్‌ ఇండియాకు ఏవిధంగా ప్రభావం చూపిస్తుందని అడుగగా..’ ఇషాంత్‌ శర్మ విషయంలో ఇదివరకు ఏం జరిగింది..ఏం జరుగబోతుంది, కెప్టెన్సీ విషయాలపై మాట్లాడను’ అని కోహ్లి అన్నాడు. ఎవరూ అడుగక ముందే కోచ్‌పై స్పందించనని చెప్పిన కోహ్లి..కొద్దిసేపాగి టీమ్‌ మెంటర్‌గా రవిశాస్త్రి వైపు నా మొగ్గు అని చెప్పాడు. భారత్‌కు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ వహించడంపై కోహ్లి నేరుగా సమాధానం ఇవ్వలేదు.
« PREV
NEXT »

No comments

Post a Comment