తాజా వార్తలు

Thursday, 17 September 2015

లోకేష్ బాబు ఆఫీసర్లనే కొనేసిన మంత్రులు....!

తాడిని తన్నేవాడుంటే వాడి తలను దన్నేవాడుంటాడు అంటారు.... పాలిటిక్స్ లో అయితే ఇలాంటి సంతతి శాతం ఇంకా ఎక్కువ! ఇలాంటి ప్రతిభ గలవారు కేవలం ప్రత్యర్థుల విషయంలోనే కాదు.. సొంత వాళ్ల విషయంలో కూడా తమ సత్తా చూపుతూ ఉంటారు. తమ టాలెంట్ తో తమపై అజమాయిషీ చెలాయిస్తున్న సొంత వాళ్లకు చెక్ చెబుతూ ఉంటారు. ఇప్పుడు నారా లోకేష్ బాబు విషయంలో ఏపీ మంత్రుల తీరు అచ్చం ఇలానే ఉంది.
సచివాలయంలో మంత్రుల పనితీరును పరిశీలించడానికి అంటూ లోకేష్ బాబు లైజనింగ్ ఆఫీసర్లను నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీ సెక్రటేరియట్ కు వెళ్లి చూస్తే... ఒక్క యనమల రామకృష్ణుడు ఆఫీసులో తప్ప అందరి మంత్రుల కార్యాలయాల్లోనూ లోకేష్ బాబు నియమిత లైజనింగ్ ఆఫీసర్లు ఉంటారు. అచ్చంగా రాజ్యాంగ వ్యతిరేకంగా వీళ్లను నియమించి ప్రభుత్వ ఖాతా నుంచే వారికి జీతాలను ఇస్తున్నారు.
ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి లేదంటే వారానికి ఒకసారి లోకేష్ బాబును కలిసి ఆయా మంత్రుల కార్యాలయాల్లో జరిగిన విషయాలను వివరించడం వీరి పని. ఈ విధంగా లోకేష్ బాబు ప్రభుత్వ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాడు. ఏపీ క్యాబినెట్ లో తనకు తెలియకుండా ఏ ఫైల్ నూ కదలకుండా... ప్రతిదీ తన కనుసన్నల్లో జరగడానికి అనుగుణంగా లోకేష్ వారిని నియమించాడు. ఈ విధంగా తమ తండ్రి మంత్రి వర్గంలోని మంత్రులను కట్టడి చేశాడు లోకేష్ బాబు.
వెనుకటికి జగన్ సచివాలయాన్ని శాసించడని తెగ ఆరోపించే తెలుగుదేశం వాళ్లు.. ఇప్పుడు అధికారంలోకి వస్తే చంద్రబాబు తనయుడు సచివాలయాన్ని శాసిస్తున్నాడు! అదే విచిత్రం. మరి రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలను ఇలా ముఖ్యమంత్రి తనయుడు శాసిస్తున్న పాలనలో మగ్గుతున్న జనాల సంగతేమో కానీ.. ఇప్పుడు ఈ యన గారి జోక్యం బాబుగారి మంత్రులకే చాలా అభ్యంతరకరం అవుతోంది. అందుకే వాళ్లిప్పుడు ఒక ప్రతివ్యూహాన్ని రచించి చంద్రబాబు తనయుడికి చెక్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
మీడియా లైజనింగ్ ఆఫీసర్లను దేవుళ్లలో చూసుకొంటున్నారు. వాళ్లు అడిగింది కాదనకుండా ఇస్తున్నారు. తమ కార్యాలయంలో తమ పక్కనే ఉండే వాళ్లకు ఐఏఎస్ స్థాయి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. ఇంతే కాదు... వాళ్లను ఏయే విధాలుగా ప్రసన్నం చేసుకోవచ్చో అన్ని విధాలుగానూ ప్రసన్నం చేసుకుంటున్నారు. లోకేష్ బాబు ఎమ్ ఎల్ వోలకు ప్రభుత్వ ఖాతా నుంచి నెలకు ముప్పై వేల లోపు జీతాన్ని ఇప్పిస్తుంటే... మంత్రులు మాత్రం ఎమ్ ఎల్ వోలకు నెల నెలా కొన్ని లక్షల రూపాయలు ఖర్చుపెడుతున్నారు! ఒకే ఒక లక్ష్యంతోనే... లోకేష్ బాబుకు ఇచ్చే రిపోర్టుల్లో తమ పట్ల పాజిటివ్ గా చెప్పలి. అందుకు ఎంతైనా ఇస్తారు! ఇదీ వ్యవహారం.
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయలు అన్నట్టుగా... లోకేష్ బాబు తమపై నిఘాను పెట్టడానికి ఎమ్ ఎల్ వోలను నియమిస్తే... వాళ్లను డబ్బుతో కొనేసి.. లోకేష్ కు ప్రతి వ్యూహాన్ని అమలు పెడుతున్నారు. తమ పనులు తాము చేసుకొంటూ.. లోకేష్ నిఘాకు కళ్లు గప్పేశారు బాబుగారి మంత్రులు. మరి నిన్నలా మొన్నొచ్చిన లోకేష్ కే అన్ని తెలివి తేటలుంటే.. ఎన్నో డక్కామొక్కీలు తిన్న తెలుగుదేశం నేతలు ఎన్ని తెలివి తేటలు ఉండాలి?

- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/tdp-ministers-counter-attack-on-lokesh-65457.html#sthash.TzSDm2OI.dpuf
« PREV
NEXT »

No comments

Post a Comment