తాజా వార్తలు

Friday, 25 September 2015

హజ్ యాత్రలో మహా విషాదం

సౌదీ అరేబియాలోని మీనాలో జరిగిన తొక్కిసలాటలో 717 మంది యాత్రికులు మరణించారు. మృతుల్లో రాష్ర్టానికి చెందిన ఓ మహిళ సహా నలుగురు భారతీయులున్నారు. ఈ దుర్ఘటనలో 860 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో వృద్ధులు, మహిళలే అధికంగా ఉన్నారు. మృతుల్లో అనేక దేశాల పౌరులున్నారని సౌదీ అరేబియా పౌర రక్షణ విభాగం తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందని స్థానిక మీడియా పేర్కొంది. 1990 తర్వాత హజ్‌యాత్రలో ఇంతటి విషాదం చోటుచేసుకోవటం ఇదే మొదటిసారి. 
తొక్కిసలాటపై సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ నయెఫ్ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఏడాది హజ్ యాత్రలో లక్షన్నరమంది భారతీయులతోపాటు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 20 లక్షల మంది ముస్లింలు పాల్గొంటున్నారు. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. 
ముస్లింల పవిత్ర నగరం మక్కాలో ఈ నెల 11న గ్రాండ్ మసీదుపై భారీ క్రేను కూలిన ఘటనలో 11మంది భారతీయులుసహా 115 మంది యాత్రికులు మరణించిన విషయం తెలిసిందే.
« PREV
NEXT »

No comments

Post a Comment