తాజా వార్తలు

Wednesday, 9 September 2015

మహేష్-సమంత ల ఫ్రెంచ్ కిస్ మిస్సేనా
మహేష్ బాబు హీరోయిన్లతో రొమాన్స్ విషయంలో చాలా స్ట్రిక్టుగా ఉంటాడు. అతడ రొమాన్స్ విషయంలో ఎప్పుడూ హద్దులు దాటింది లేదు. పెళ్లికాక ముందు నుంచి కూడా హీరోయిన్లతో హద్దులు దాటి రొమాన్స్ చేసింది లేదు. అలాంటి ఇమేజ్ తెచ్చుకోవడానికి ఎప్పుడూ ఇష్టపడలేదు. ఇకముందూ అదే దారిలో సాగుదామనే అనుకుంటుండగా.. అతడి ఫేవరెట్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల నుంచి ఓ విచిత్రమైన ప్రపోజల్ వచ్చినట్లు సమాచారం. మామూలుగా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లే తీసే శ్రీకాంత్.. తన కొత్త సినిమా ‘బ్రహ్మోత్సవం’లో మాత్రం కథ డిమాండ్ మేరకు ఓ ఫ్రెంచ్ కిస్ ఉండాలని భావించాడట. మహేష్ సమంతల ఆ ముద్దు ప్లాన్ చేసుకున్నాడట. కానీ మహేష్ కు అసలు విషయం చెప్పగానే ఖరాఖండిగా నో చెప్పేసినట్లు సమాచారం.

సమంత ముద్దులాటకు అడ్డు చెప్పే అవకాశమే లేదు. తొలి సినిమా ‘ఏమాయ చేసావె’లోనే బోలెడన్ని పెదవి ముద్దులతో మోత పుట్టించేసింది. కానీ మహేష్ మాత్రం తన ‘నో కిస్’ పాలసీని పక్కనబెట్టే సమస్యే లేదని.. తాను అలాంటి సన్నివేశాల్లో నటించడడానికి అస్సలు ఇష్టపడనని చెప్పేశాడట. ఇంతకుముందు ‘బిజినెస్ మేన్’లో కాజల్ తో ఊరికే పెదాలు అలా తాకించినందుకే చాలా ఇబ్బందైపోయిందని.. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వ్యతిరేకత వచ్చిందని.. అందుకే తన దగ్గర ఇలాంటి ప్రపోజల్స్ పెట్టొద్దని స్పష్టం చేశాడట మహేష్. ‘శ్రీమంతుడు’ విజయాన్ని రెండు మూడు వారాల పాటు ఆస్వాదించిన అనంతరం ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్ వెళ్లొచ్చిన మహేష్.. ఇంకో వారంలో ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్ మొదలుపెట్టబోతున్నాడు. ఈ సినిమాలో సమంతతో పాటు కాజల్ ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది.
« PREV
NEXT »

No comments

Post a Comment