తాజా వార్తలు

Wednesday, 9 September 2015

మహేష్ ని రాయతీల కోసమే ఇలా చేస్తున్నాడు అన్న తేజా?
చేసేవాడిని చేయనివ్వాలి..అంతే కానీ ఎందుకో చేస్తున్నాడు అని కన్నాలు వెదక్కూడదు. సరే, కాస్త సేవ చేస్తే, ప్రభుత్వం ఏదైనా రాయతీలు ఇస్తే ఇవ్చొచ్చు. కానీ రాయతీల కోసమే ఇలా చేస్తున్నారు అనడం సబబు కాదేమో? కేంద్రం, రాష్ట్ర పభుత్వాలు, గ్రామాలను ప్రయివేటు ఫండ్స్ తో అభివృద్ధి చేయించేందుకు, ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా కార్పొరేట్ సంస్థలను, సెలబ్రిటీలను, అధికారులను ముందుకు రమ్మంటున్నాయి. మరి వాటికి ఆ ఖర్చుకు బదులుగా టాక్స్ ఎగ్జెంప్షన్ ఇస్తే ఇచ్చి వుండొచ్చు. ఇటీవల మహేష్ రెండు గ్రామాలు, ప్రకాష్ రాజ్ ఒక గ్రామం, శృతి హాసన్ ఇలా చాలా మంది దత్తత బాట పట్టారు. దీనిపై జర్నలిస్టులు దర్శకుడు తేజను ప్రశ్నిస్తే, 'ఆళ్లంతా..దేనికి చేస్తున్నారో, బహుశా ఏదో టాక్స్ వెసులు బాటు ఇస్తామని అని వుండొచ్చు. అందుకే ఈ వేలం వెర్రి..నిజంగా చేసే ఉద్దేశం వుంటే, ఒక్కడు సినిమా హిట్ అయినపుడే చేయచ్చుగా' అన్నాడు. ఒక్కడు సినిమా టైమ్ లో మోడీ లేడు..తెలంగాణ గ్రామజ్యోతి లేదు..ఆంధ్రలో గ్రామాల దత్తత స్కీము లేదు. ఇప్పుడు కదావచ్చింది. ప్రభుత్వం నుంచి రిక్వెస్ట్ నో, మోటివేషన్ నో వున్నపుడు కదా ఎవరైనా ముందుకు వెళ్లేది. ఆ మాత్రం తెలియకుంటే ఎలా?  
« PREV
NEXT »

No comments

Post a Comment