తాజా వార్తలు

Tuesday, 15 September 2015

నేలకూలిన వందేళ్ల మర్రిచెట్టు
భారీ వర్షాలు, ఈదురుగాలుల వల్ల కర్నూలు జిల్లా మహానంది క్షేత్రం శివారులో ఆదివారం రాత్రి వందేళ్ల నాటి మర్రిచెట్టు నేల కూలింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే, మర్రిచెట్టు రహదారికి అడ్డంగా పడి 24 గంటలు దాటినా.. ఆర్‌అండ్‌బీ అధికారులు తొలగించకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. వాహనాలను అక్కడే నిలిపివేసి కిలోమీటరు దూరం నడిచి దైవదర్శనం చేసుకున్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment