తాజా వార్తలు

Saturday, 12 September 2015

మక్కా గ్రాండ్ మసీదులో ఘోర ప్రమాదం, 107మంది మృతి

సౌదీ అరేబియాలో మక్కా నగరంలోని గ్రాండ్ మసీదులో క్రేన్ కూలిన ప్రమాదంల 107 మంది మృతిచెందగా మరో 180 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మృతుల్లో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ వివరాలు వెల్లడించింది. గాయపడిన వారిలో మరో 15 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపారు. జెడ్డాలోని భారత రాయబార కార్యాలయం అధికారులు సంఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తోన్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభం కానున్న హజ్ యాత్ర నేపథ్యంలో చేస్తోన్న ఏర్పాట్లలో భాగంగా చేపట్టిన పనుల్లోనే భారీ క్రేన్ కూలిపోవడంతో ఈ దుర్ఘటన సంభవించింది.  
« PREV
NEXT »

No comments

Post a Comment